ముత్తంగి, మల్కాపూర్ గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సస్పెండ్ ఉత్తర్వులు జారీ…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ముత్తంగి, మల్కాపూర్ గ్రామ పంచాయతీల కార్యదర్శులకు సస్పెండ్ ఉత్తర్వులు జారీ…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన పటాన్చెరు మండలం ముత్తంగి, కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామపంచాయతీల కార్యదర్శులకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ముత్తంగి కార్యదర్శి కిషోర్ అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని, మల్కాపూర్ కార్యదర్శి శ్రీమతి సునీత గ్రామంలో ఎటువంటి అక్రమ నిర్మాణాలు లేవని ధ్రువీకరణ ఇచ్చారని, జిల్లా పంచాయతీ అధికారి తనిఖీలో అక్రమ నిర్మాణాలు గుర్తించి, వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తొలగించడంలో నిర్లక్ష్యం వహించినందున సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

పటాన్చెరు మండలం ఇస్నాపూర్ పాలకమండలి అనుమతి లేని లేఅవుట్లలో గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి తీర్మానించి , అనుమతులు ఇచ్చినందున సంబంధిత గ్రామ పంచాయితీ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. పంచాయతీ కార్యదర్శి వై. హరిబాబు కు చార్జి మెమో ఇచ్చి బదిలీ ఉత్తర్వులు జారీ చేశామని ఆయన తెలిపారు.

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పటాన్చెరు, కొండాపూర్ మండల పంచాయితీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

Share This Post