ముదిగొండ మండలంలో ప్రయివేటు స్థలాల్లో కొనసాగుతున్న నర్సరీలను ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటుకు ఇంకనూ స్థలాన్ని గుర్తించని గ్రామాలలో వారంరోజులలోపు స్థల సేకరణ చేసి నర్సరీలను అట్టి స్థలాల్లోకి తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించారు.

ప్రచురణార్ధం

అక్టోబరు,08, ఖమ్మం:

ముదిగొండ మండలంలో ప్రయివేటు స్థలాల్లో కొనసాగుతున్న నర్సరీలను ప్రభుత్వ స్థలాలలో ఏర్పాటుకు ఇంకనూ స్థలాన్ని గుర్తించని గ్రామాలలో వారంరోజులలోపు స్థల సేకరణ చేసి నర్సరీలను అట్టి స్థలాల్లోకి తరలించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మండల పరిషత్ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. శుక్రవారం ముదిగొండ మండల పర్యటన సందర్భంగా కమలాపురం, లక్ష్మీపురం గ్రామాలలో పల్లె ప్రకృతివనం, నర్సరీలను కలెక్టర్ తణిఖీ చేసారు. లక్ష్మీపురంలో ప్రయివేటు స్థలంలో కొనసాగుతున్న నర్సరీను ప్రభుత్వ స్థలంలోకి మార్చేందుకు గాను వారంరోజుల లోపు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నర్సరీని అట్టి ప్రభుత్వ స్థలంలోకి మార్చాలని ఎం.పి.డి.ఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం నర్సరీలో ఉన్న మొక్కల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేయనున్న పల్లె ప్రకృతి వనం స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం పనులను పదిహేను రోజులలోపు పూర్తి చేయాలని, ఫెన్సింగ్, నీటి వసతి తదితర సదుపాయాలను సమకూర్చుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఎం.పి.డి.ఓ డి. శ్రీనివాసరావు, ఎం.పి.ఓ సూర్యనారాయణ, డిప్యూటీ తహశీల్దారు కరుణాకర్రెడ్డి, ఏ.పి.ఓ విజయకుమార్, గ్రామ కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share This Post