మునిసిపల్ పనులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

మునిసిపల్ పనులను సమీక్షించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-06:

శుక్రవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఏర్పాటు చేసిన మునిసిపల్ కమీషనర్లు, మునిసిపల్ అధికారులతో చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సమీక్షించారు.

మునిసిపల్ పనితీరు, హరితహారం, నర్సరీలు, అర్బన్ ట్రీ ప్లాంటేషన్, సెగ్రిగేషన్ షెడ్స్, టౌన్ ప్లానింగ్, జిల్లా టాస్క్ ఫోర్స్ పనితీరు, రెవెన్యూ విభాగాల వారీగా, మునిసిపాలిటిల వారీగా సమీక్షించారు.

హరితహారం లక్ష్యాన్ని సాధించాలని, అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు పెంపకం, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచాలని, లక్ష్యాన్ని సాధించలని తెలిపారు. వార్డుల వారీగా మొక్కలు లక్ష్యానికి తగ్గకుండా పెంచాలని, వార్డులో ఒక చోట ఖాళీ స్థలం లేకపోతే, మరో చోట స్థలం బట్టి మొక్కలను నాటాలని తెలిపారు. కమర్షియల్ ఏరియాలో మొక్కలను ఎలా పెంచుతున్నారు అని అడిగి తెలుసుకున్నారు. షాపుల వారికి మొక్కలను పెంచుకొనుటకు కుండీలను సరఫరా చేసి మొక్కలు పెంచేవిధంగ చూడాలని తెలిపారు. ఇంటర్నల్ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని తెలిపారు. వార్డుల్లో పెంచే మొక్కల సంరక్షణ బాధ్యతలను వార్డు లొకల్ కమిటీ సభ్యులకు అప్పజెప్పాలని, కమిటీ సభ్యులు టెండర్ పొందిన వ్యక్తిచే మొక్కలు పెరిగేలా మానిటరింగ్ చేయాలని తెలిపారు. డివైడర్స్ మధ్యలో పెంచుతున్న మొక్కలకు సరిగా నీటి సరఫరా అయ్యే విధంగా చూడాలని తెలిపారు. ఇన్ స్టిట్యూషనల్ ప్రదేశాల్లొ మొక్కలు విరివిగా పెరిగే విధంగా మునిసిపల్ కమీషనర్లు చూడాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు ట్రీ గార్డ్స్ మాత్రమే ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. మొక్కలు నాటేటప్పుడు కూడా నిటారుగా కనిపించేందుకు సపోర్ట్ గా కర్ర ను పాతాలని, దాని చుట్టూ ఒక మీటర్ వ్యాసార్థం గల నాణ్యమైన ట్రీ గార్డ్ ను ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా మొక్కలన్నీ క్రమపద్ధతిలో నాటాలని ట్రీ గార్డ్స్ వివిధ రంగులలో ఏర్పాటు చేస్తే అందంగా కనిపిస్తాయి అన్నారు. రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లను తొలగించాలని సూచించారు. ఒక క్రమ పద్ధతిలో రోడ్డుకు రెండువైపులా మొక్కలు అందంగా కనబడేలా నాటాలని తెలిపారు.

మునిసిపల్ ప్రాంతాల్లొ శానిటేషన్ ప్రణాఌకాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. శానిటేషన్ కొరకు ట్రాక్టర్లు, ఆటోలు, ట్రై సైకిళ్ళు, జె.సి.బిలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్, ఎనివిరాన్ మెంటల్ ఇంజనీర్లు, జవాన్లు, కార్మికులు ఎంతమంది ఉన్నారు అడిగి తెలుసుకొని సాధ్యమైనంత మేరకు నివాస ప్రాంతాలలో శానిటేషన్ లోపించకుండా జాగ్రత్తలు పాటించాలని, అవసరమైన మెటీరియల్ తగ్గకుండా చూడాలన్నారు. బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేయాలని సూచించారు.

జిల్లా టాస్క్ ఫోర్స్ సరిగా పనిచేయుట లేదని, అనుమతిలేని భవనాలను చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని భవనాలను పరిశీలించి వారం, వారం సదరు భవనాలపై చర్యలు తీసుకునే విధంగ ప్రణాఌకలు రూపొందించి పటిష్టంగా చర్యలు తీసుకోవాలని, డిమాలిష్ చేసేటప్పుడు పోలీసు శాఖ సహాయం తీసుకోవాలని సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో మహబూబాబాద్, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్ మున్సిపల్ కమీషనర్లు నరేందర్ రెడ్డి, జి.బాబు, గణేష్ బాబు, కె.వెంకటేశ్వర్లు, డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, శానిటరి ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post