మును గోడ్ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ కమిటీ

మును గోడ్ ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ ఆండ్ మానిటరింగ్ కమిటీ (ఎం.సి.ఎం.సి) ఎన్నికల వ్యయ పరిశీలకు రాలు ముళ్ళ పూడి సమత సోమవారం పరిశీలించారు. వివిధ పత్రికలలో, టి.వి. ఛానల్, కేబూల్ నెట్వర్క్ లలో, సినిమా టాకిసులలో మరియు సోషల్ మీడియాలో వచ్చే వివిధ రాజకీయ ప్రకటనలను,పెయిడ్ న్యూస్ ను ఏప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సర్టిఫికేషన్ మరియు మీడియా మానిటరింగ్ (MCMC) కమిటి పని తీరు ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఆమె తో పాటు సహాయ వ్యయ పరిశీలకులు సురేష్,ఎం.సి.ఎం.సి నోడల్ అధికారి శ్రీనివాస్ ఉన్నారు.

Share This Post