మున్సిపల్ అనుమతుల మేరకే నిర్మాణలు జరగాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0 0 0 0
మున్సిపల్ పరిధిలో జరిగే ప్రతి నిర్మాణం మున్సిపల్ అనుమతుల మేరకు మాత్రమే జరగాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారుతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గోన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలో నిర్మించే భవనాలు, నిర్మాణాలు టిఎస్బిపాస్ అనుమతులు పొందిన ప్రకారమే జరిగాలని అన్నారు. మున్సిపల్ బడ్టెట్ లో కేటాయించిన గ్రీన్ బడ్జెట్ ఆర్థిక సంవత్సరాంతంనికి పూర్తిగా వినియోగించాలని పనులు చేపట్టాలని, నిధులు ల్యాప్స్ కాకుండా పనులు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ రెవెన్యూ పెంచే దిశగా దృష్టిసారించాలని, మున్సిపల్ టాక్స్ లు, ట్రేడ్ టాక్స్ కలెక్షన్ లు సక్రమంగా జరిగేలా చూడాలని, మున్సిపల్ పరిదిలో జరిగే ప్రతి అభివృద్ది పనికి ఇతర నిధులపై ఆధార పడకుండా వసూలు చేసిన టాక్స్ లను వాడుకునేలా దృష్టిసారించాలని సూచించారు. ప్రగతిలో వెనకబడి పోయిన అధికారులు వేగవంతంగా పనులు పూర్తిచేసేలా ప్రత్యేక కార్యచరణను రూపొందించుకొని పనులు పూర్తిచేయాలన్నారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, మంజూరు చేసిన బడ్జెట్ నుండి 10శాతం గ్రీన్ బడ్జెట్ సక్రమంగా వినియోగించాలని, పెండింగ్ బిల్లులు, సిసి చార్జెస్ వసూలు సక్రమంగా జరిగేలా చూడాలని, నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 90శాతం బ్యాగ్ ఫిలింగ్ పనులు పూర్తయినాయని, సాయిల్ ఫిల్లీంగ్, విత్తనాలు నాటడం, మొదలగు పనులు పూర్తిచేయాలని సూచించారు. 1/3 నిధులను క్రిటికల్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ కొరకు వినియోగించాలని, అవసరం ఉన్న చోట పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలన్నారు. మున్సిపల్ అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తిచేసేలా అధికారులు కృషిచేయాలని సూచించారు. భూదాన్ యాప్ లో నమోదులు సక్రమంగా జరగాలని సూచించారు.