మున్సిపల్ అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలి …

ప్రచురణార్థం

మున్సిపల్ అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలి …

మహబూబాబాద్ సెప్టెంబర్ 28.

మున్సిపల్ పరిధిలో చేపడుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

మంగళవారం మున్సిపల్ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జి, 23 వ వార్డు లోని పట్టణ ప్రకృతి వనం, మూడు కోట్ల నుండి తొర్రూర్ రోడ్ లో నిర్మిస్తున్న డివైడర్లు నిర్మాణాలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద డ్రైనేజ్ వాటర్ సిస్టంను పటిష్ట ప్రణాళికతో సరి చేసిన తర్వాతనే సిసి రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.

23వ వార్డులో పట్టణ ప్రకృతి వనాన్ని సందర్శించి పరిశీలిస్తూ వాష్ రూమ్ లను త్వరితగతిన నిర్మించాలన్నారు వాకింగ్ ట్రాక్ డ్రైనేజీ సిస్టం సరిచేయాలని సూచించారు.

తొర్రూర్ రోడ్ లో నిర్మిస్తున్న డివైడర్ లను పరిశీలిస్తూ నిర్మాణాలు నాణ్యతతో చేపట్టాలన్నారు.

రైల్వే స్టేషన్ వద్ద నిర్మిస్తున్న మోడల్ మార్కెట్ పనులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.

అనంతారం రహదారిలో 5 కోట్లతో చేపట్టిన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు

అంతకుముందు రోడ్లు భవనాలు ఇంజనీరింగ్ అధికారులతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించే స్థలాన్ని సందర్శించి పరిశీలించారు .

కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంజిత్ డి ఈ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
—————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ వారిచే జారీ చేయనైనది.

Share This Post