మున్సిపల్ కమిషనర్ లతో సమావేశం*

 శుక్రవారం (31.12.21) నల్గొండ పట్టణం లో రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె. టి.ఆర్.మున్సిపల్ కమిషనర్ లు,చైర్ పర్సన్ లు,శాసన సభ్యులతో మున్సిపాలిటీ లలో అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నందున ముందస్తుగా జిల్లా కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, పురోగతి లో ఉన్న పనులు, మున్సిపాలిటీ ల అభివృద్ధి అవసరమైన పనులు,మౌలిక వసతులు శాసన సభ్యులతో చర్చించి శుక్రవారం సమావేశం కు సమగ్ర సమాచారం తో హాజరు కావాలని అన్నారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ. కందూ కూరి వెంకటేశ్వర్లు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post