మున్సిపల్ పరిధిలోని పాచిగుట్ట, బాలనగర్ ప్రాంతాలలో పట్టణ ప్రగతి కార్యక్రమాల జిల్లా కలెక్టర్ తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది:06.06.2022, వనపర్తి.

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఆయా వార్డులను తీర్చిదిద్దాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం మున్సిపల్ పరిధిలోని పాచిగుట్ట, బాలనగర్ ప్రాంతాలలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వీధులలో పారిశుద్ధ్యాన్ని, డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలపై ఆరా తీశారు. పట్టణ ప్రజలు ప్రతి రోజు తడి, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ ట్రాక్టర్లకు తరలించాలని, అదేవిధంగా తడి, పొడి చెత్త సెగ్రిగెసన్ షెడ్ కు తరలించాలని ఆమె ఆదేశించారు. రోడ్లను, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలని మునిసిపల్ సిబ్బందికి ఆమె సూచించారు. వార్డులలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని గుర్తించి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వార్డులలోని సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కాలనీలలోని చిన్నారులతో ముచ్చటించారు. ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలని ఆమె సూచించారు. జూన్ 18వ తేదీలోగా ఆయా సమస్యలను గుర్తించి, జాప్యం లేకుండా పరిష్కరించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా అధికారులు కృషి చేయాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post