*మున్సిపల్ పరిధిలో అక్రమ లేఅవుట్ లు జరగకుండా చూడాలి :: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్

*మున్సిపల్ పరిధిలో అక్రమ లేఅవుట్ లు జరగకుండా చూడాలి :: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్

*ప్రచురణార్థం-1*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 23: సిరిసిల్ల, వేములవాడల మున్సిపల్ పరిధిలో అక్రమ లేఅవుట్ లు, నిర్మాణాలు జరగకుండా జిల్లా టాస్క్ ఫోర్స్ ద్వారా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్ లో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో అదనపు కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీని ఈ అక్రమ లేఅవుట్ లు జరగకుండా పర్యవేక్షించేందుకు వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల పరిధిలో అనుమతి లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. సిరిసిల్ల కరకట్ట పనుల వెడల్పు నిర్ధారణ, తదితర అంశాలపై ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. వేములవాడ మూలవాగు శివారులో బఫర్ జోన్ ఫిక్స్ చేసేలా చూడాలని అన్నారు. మున్సిపాలిటీల పరిధిలో భవన నిర్మాణ అనుమతులను ఆలస్యం చేయకుండా వెంటనే మంజూరు చేయాలని అన్నారు. అక్రమ నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయకుండా సబ్ రిజిస్ట్రార్లతో సమన్వయం చేసుకుని అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ & బి ఈఈ కిషన్ రావు, ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, సిరిసిల్ల, వేములవాడ ల మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారులు అన్సార్, అంజయ్య, తహశీల్దార్లు విజయ్ కుమార్, మునీందర్, సెస్ ఎండీ రామకృష్ణ, డీఈ రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post