మున్సిపల్ పరిధిలో ఉన్న రహదారులను స్వీపింగ్ యంత్రాలు వినియోగం ద్వారా పరిశుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

.  బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లతో హరితహారం, పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, ప్రధాన రహదారులు స్వీపింగ్ యంత్రాలతో పరిశుభ్రం చేయు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివైడర్లు ప్రక్కన ఇసుక పేరుకుపోవడం వల్ల వాహన దారులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని స్వీపింగ్ యంత్రాలు వినియోగం ద్వారా పరిశుభ్రం చేయుంచాలని చెప్పారు.   హరితహారంలో కేటాయించిన  లక్షాలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.  మున్సిపల్ కమిషనర్లు ఉదయమే వార్డులలో పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణను పరిశీలించాలని చెప్పారు. పారిశుధ్య సిబ్బంది నిర్ణీత సమయానికి విధులకు హాజరవుతున్నారా లేదా పరిశీలన చేయాలని చెప్పారు.  పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత నివ్వాలని చెప్పారు. అలాగే వార్డుల వారీగా కంపోస్టు బిన్లను ఏర్పాటు చేయాలని, జీవ వైవిధ్యం పెంచేందుకు  డెన్స్ ప్లాంటేషన్లులో విరివిగా మొక్కలు నాటాలని చెప్పారు.  కౌన్సిలర్లు  ప్లాంటేషన్ కార్యక్రమంలో  ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పారు.  సింగరేణి సంస్థ  ఇస్తానన్న భూములను త్వరగా స్వాధీనం చేసుకోవాలని.మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ సీతాలక్షి, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post