మున్సిపల్ పరిధిలో ప్రజలు సమస్యలను తెలియచేసేందుకు వీలుగా అన్ని మున్సిపాల్టీలలో కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ కమిషనర్లు, ప్రత్యేక అధికారులతో పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మున్సిపాల్టీలలో గార్బేజ్ రెస్పాన్సబులిటీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అరుబయట వ్యర్థాలు కనిపిస్తే ప్రజలు కాల్ సెంటర్కు ఫోన్ చేయగానే తక్షణమే మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణ చేసి సంబంధిత యజమానులకు జరిమాన విధించాలని చెప్పారు. ప్రతి వార్డులో వస్తున్న వ్యర్థాలను స్థానికంగానే వర్మి తయారు చేయుటకు టెట్రా వర్మి యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అదే విధంగా పార్కులు, విద్యాలయాలు, వసతి గృహాల్లో వ్యర్ధాలను వర్మిగా తయారు చేయుటకు టెట్రా వరి యూనిట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మురుగు కాల్వల్లో వ్యర్థాలను తొలగించేందుకు జెట్టింగ్ యంత్రాలను కొనుగోలు చేయాలని చెప్పారు. ప్రతి ఇంటి తడి పొడి వ్యర్థాల సేకరణ జరగాలని చెప్పారు. తడి పొడి వ్యర్థాలు సేకరణ, వేరుచేయు అంశాలపై ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాల గ్రూపు సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ప్రతి మున్సిపాల్టీలో ఒక ఆత్మ నిర్బర్ వార్డును ఎంపిక చేసి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోషియేషన్ టీమ్సు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి మున్సిపాల్టీలో వివిధ రంగాలలో పేరొందిన వ్యక్తులను అంబాసిడర్లుగా వినియోగించుకోవాలని వారి ద్వారా ప్రజలకు అవగాహన కల్పనకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యర్థాలు వేరుచేసేందుకు ప్రతి డిఆర్స్సిలో కన్వేయర్ బెల్ట్ యంత్రాలు, ఫిట్కా మిషన్స్, హ్యాండ్ బైలర్స్ కొనుగోలు చేయాలని చెప్పారు. రానున్న శుక్రవారం వరకు అన్ని మున్సిపాల్టీలలో యంత్రాలు ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. మున్సిపాల్టీలలో పుట్ పాత్లపై ఏర్పాటు చేసిన ఆక్రమణలను తొలగించాలని చెప్పారు. పుట్పాత్లు ఆక్రమణకు గురికావడం వల్ల పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వీధి వ్యాపారులకు కేటాయించిన స్థలాల్లో మాత్రమే వ్యాపారాలు నిర్వహించాలని, ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు నిషేదమనే బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిరంతర పర్యవేక్షణ చేయకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల పుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని, పర్యవేక్షణ చేసి తొలగించకపోతే మళ్లీ రోడ్ల మీదకు వ్యాపారులు వస్తుంటారని ఇది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలో ముర్రేడు వంతెన నుండి పాస్టాఫీసు సెంటర్ వరకు పుట్పాత్లను మరమ్మత్తులు చేయాలని, టైల్స్ వేయాలని చెప్పారు. ప్రగతి మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి అనువుగా నెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాల్టీలలో సిరిసిల్ల తరహాలో విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగ పడే విధంగా గ్రంధాలయ ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. విద్యార్థులకు ఉపయోగ పడే గ్రంథాలయం ఏర్పాటుకు ఆలోచనలు చేయాలని చెప్పారు. ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసిన 15 రోజుల్లో టిఎస్బిపాస్ ద్వారా అనుమతి ఇవ్వాలని, అవకాశం లేనట్లయితే తిరస్కరణ చేయాలని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని, అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే తక్షణమే కూల్చివేయాలని చెప్పారు. డివైడర్లు పక్కనున్న వ్యర్థాలను తొలగించాలని చెప్పారు. మున్సిపాల్టీల పరిధిలోని అవెన్యూ, మీడియన్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని చెప్పారు. జనవరి మాసాంతం వరకు నూరు శాతం ఇంటి పన్నులు వసూలు జరగాలని చెప్పారు. మున్సిపాల్టీలలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు మురుగువాసన రాకుండా మన ఇంటిలో ఏ విధంగా పరిశుభ్రంగా ఉంటాయో ఆ విధంగా ఉండాలని చెప్పారు. మున్సిపాల్టీలలో జరుగుతున్న సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాల నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.

 

ఈ సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ ప్రత్యేక అధికారులు అర్జున్, ముత్యం, అలీం, మున్సిపల్ కమిషనర్లు సంపత్కుమార్, శ్రీకాంత్, అంజయ్య, నాగప్రసాద్, డిఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు. తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post