మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అర్బన్ లోకల్ బాడీస్ లో లా ఆఫీసర్ల నియామకానికి జిల్లాలోని అడ్వకెట్ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి నేడోక ప్రకటనలో తెలిపారు

మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ అర్బన్ లోకల్ బాడీస్ లో లా ఆఫీసర్ల నియామకానికి జిల్లాలోని అడ్వకెట్ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి నేడోక ప్రకటనలో తెలిపారు. అడ్వకెట్ల  ప్యానెల్ నుండి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కు లా ఆఫీసర్లను నియమించుకుంచుకునేందుకు  నవంబర్ 11వ తేదీన రాష్ట్ర కేబినెట్లో  ఆమోదం తెలిపడం జరిగిందని దీనికి అనుగుణంగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు సర్కలర్ జారీ చేయడం జరిగిందన్నారు.  సర్కలర్ కు అనుగుణంగా జిల్లాలోని మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కు లా ఆఫీసర్లను నియమించడం జరుగుతోందని తెలిపారు.  మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ లో లా ఆఫీసర్ గా పనిచేయుటకు ఆసక్తి కలిగిన అడ్వకెట్లు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టర్/ఆదనవు కలెక్టర్ కార్యాలయంలో అందజేయాల్సిందిగా కొరినారు.

Share This Post