మున్సిపాలిటీలలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచాలి… జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ప్రచురణార్థం

మున్సిపాలిటీలలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెంచాలి…

తొర్రూర్, మహబూబాబాద్ – జూలై 16 :

రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించాలని మెగా పట్టణ ప్రకృతి వనం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం తొర్రూరు పట్టణం, మండలంలోని మడుపల్లి మాటేడు ఫతేపూర్ గ్రామాల్లో తెలంగాణకు హరితహారం లో భాగంగా నాటుతున్న ప్రతి మొక్కను రక్షించాలని మొక్కలు నాటి స్ఫూర్తి నిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ హరితహారం లో ప్రతి పల్లె పట్టణాలు పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలని , చెట్లు ప్రాణకోటికి ఆయువు మెట్లు అని వాటిని పసిపిల్లల కాపాడితే మన చివరి వరకు తోడుగా ఉంటుందని అన్నారు.

మడిపల్లి శివారు సోమవారం కుంట ,మడిపల్లి, తొర్రూర్ పట్టణంలో, పత్తేపురం గ్రామపరిధిలోని తొర్రూర్ , మహబూబాబాద్ మరియు తొర్రూర్ ఖమ్మం ప్రధాన రోడ్డు కు ఇరువైపులా నాటుతున్న ‘అవెన్యూ ప్లాంటేషన్’ మొక్కలను పర్యవేక్షించారు. నిర్ధారించిన కొలతల్లో ఫిట్ తీయాలని, మొక్కకు మొక్కకు మధ్య డిస్టెన్స్ ఉండాలని మొక్కకు సపోర్ట్గా కర్రను నాటాలని, పశువుల నుండి కాపాడేందుకు చుట్టూ ట్రీ గార్డ్స్ , ముళ్ళకంప లను నాటించాలని అన్నారు. Chrono కార్పస్ మొక్కలను ఎక్కువగా ఉపయోగించకుండా నీడను ఆక్సిజన్ ఇచ్చే మొక్కలను నాటుకోవాల న్నారు. భవిష్యత్తులో రోడ్డు వెడల్పు దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని మొక్కలను మళ్ళీ తొలగించకుండా థర్డ్ లేయర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

తొర్రూర్ దుబ్బ తండ ఆవరణలోని గ్యాస్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డివైడర్ వద్ద ప్రమాదాలు జరుగు స్థలమును పర్యవేక్షించి కారణాలు తెలుసుకొని ప్రాక్టికల్ గా తన సొంత వాహనంలో కారణాలు తెలుసుకొని తగు సూచనలు సలహాలు చేస్తూ రోడ్ సేఫ్టీ కమిటీకి ప్రమాదాలు నివారించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. పట్టణంలో ఉన్న మెగా పట్టణ ప్రకృతి వనమును త్వరగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డివైడర్ కు మధ్యలో అందమైన మొక్కలను నాటించాలని కలెక్టర్ సూచించారు. మాటేడు ఆవరణలో ఉన్న లేఅవుట్లు రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని, ఎంతవరకు ప్లాంటేషన్ అయిందని పెన్సింగ్ చేశారా అని ఓపెన్ ప్లాట్స్ తీసారా, పెన్సింగ్ చేశారా, అని, గ్రీన్ ల్యాండ్ కోసం డెవలపర్స్ నుండి ల్యాండ్ తీసుకున్నారా లేదా అని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ల్యాండ్ కోసం డెవలపర్స్ నుండి ల్యాండ్ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ రమేష్, ఎంపీపీ తూర్పాటి అంజయ్య, జెడ్ పి టి సి శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి రవీందర్ మున్సిపల్ చైర్ పర్సన్ రామచంద్రయ్య, అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కృష్ణవేణి వ్యవసాయ శాఖ ఏ వో కుమార్ యాదవ్ ఏ ఈ ఓ ఆమని పంచాయతీ సెక్రటరీ శోభా మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, తహసిల్దార్ రాఘవరెడ్డి, ఏ పీ ఓ పార్థసారధి, మిషన్ భగీరథ ఏఈ నిశాంక్ ,ఆర్ & బి డి ఈ, ఏఫ్ ఎస్ ఓ, స్పెషల్ ఆఫీసర్ రవీందర్, వైస్ ఎంపీపీ ఈట్టే శ్యామ్ సుందర్ రెడ్డి, ఏం పి ఓ గౌస్ ,ఆయా గ్రామాల సర్పంచులు యాకమ్మ, అంజలి, సోమలక్ష్మి మున్సిపల్ కౌన్సిలర్లు వార్డ్ నెంబర్లు పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎం అంగన్వాడీ ఆయాలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————–
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post