మున్సిపాలిటీలలో లే ఔట్స్ పై దృష్టిపెట్టాలి… రాష్ట్ర మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్

ప్రచురణార్థం

మున్సిపాలిటీలలో లే ఔట్స్ పై దృష్టిపెట్టాలి…

మహబూబాబాద్ జూలై 20:

జిల్లా ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్న వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారని వాటిపై అధికారుల దృష్టి పెట్టి layouts జారీ చేస్తూ 10 శాతం గ్రీన్ ఫీల్డ్ అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ పరిధిలోని లేఅవుట్ లపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.

2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లే ఔట్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు మున్సిపాలిటీలు అదనంగా ఏర్పాటు కావడం జాతీయ రహదారులు ఏర్పాటు మున్సిపల్ ప్రాంతాలు అభివృద్ధి చెందడం వెంచర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోందని మున్సిపల్ శాఖ అధికారులు వెంచర్ల పై దృష్టి పెట్టి గ్రీన్ ఫీల్డ్ ప్రాంతాల అభివృద్ధి కి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

10 శాతం గ్రీన్ ఫీల్డ్ కేటాయించని వెంచర్లకు అనుమతి ఇవ్వరాదని అన్నారు.

లేవు టు అనుమతులు పొందిన స్థలాలను ఆయా గ్రామ పంచాయతీలు గాని మున్సిపాలిటీలకు గాని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలన్నారు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే లే అవుట్ అనుమతులు ఇవ్వాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మున్సిపల్ కమిషనర్ నరేందర్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ పాల్గొన్నారు
————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post