మున్సిపాలిటీలలో స్వచ్ఛ సర్వేక్షన్ -2022 కార్యక్రమంపై సమీక్ష సమావేశం : జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన 10 .1 .2022  వనపర్తి

వనపర్తి జిల్లాలోని మున్సిపాలిటీలలో స్వచ్ఛ సర్వేక్షన్ -2022 క్రింద చేపట్టిన కార్యక్రమాలను పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే మునిసిపాలిటీలలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు పూర్తి చేయాలని అన్నారు. ఇంకా మిగిలిన పనులను సత్వరం పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. మున్సిపాలిటీలలో నర్సరీల పర్యవేక్షణ మొక్కలు నాణ్యత పెరిగేలా చూడాలన్నారు. చెత్త సేకరణ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు ఆన్ గోయింగ్ పనులు సిసి రోడ్లు, డ్రైనేజీ తదితర పనులు, మిషన్ భగీరథ,  పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా పట్టణ ప్రగతి లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లలు సిబ్బంది పాల్గొన్నారు….. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడినది.

Share This Post