మున్సిపాలిటీల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి –జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

ప్రచురణార్ధం

మున్సిపాలిటీల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.

మహబూబాబాద్, ఆగస్ట్,25.

మున్సిపాలిటీలలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయంలో 4 మున్సిపాలిటీలు మహబూబాబాద్, తొర్రుర్, డోర్నకల్, మరిపెడలలో చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ సమీక్షించారు.

రోడ్ల విస్తరణ, జంక్షన్స్, సెంట్రల్ లైటింగ్, బి.టి.రోడ్స్, డ్రైన్స్ ,ఎస్సి సబ్ ప్లాన్ నిధుల వినియోగం పై సమీక్షించారు.

రోడ్ల విస్తరణలో డ్రైనేజి నీరు నిలిచిపోకుండా తాత్కాలిక పద్దతి పై వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.హరితహారం,
ప్రాపర్టీ టాక్స్, లే అవుట్స్ పై సమీక్షించారు.

ఈ సమీక్ష సమావేశంలో మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రుర్ మున్సిపల్ కమిషనర్ లు ప్రసన్న వాణి, వెంకటేశ్వర్లు, గణేష్, గుండె బాబు, మహబూబాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ ,మున్సిపల్ డి.ఈ.ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం,మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post