ప్రచురణార్థం
మహబూబాబాద్ మార్చి 25.
ప్రజల అవసరాలను తీర్చే విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి చేపట్టాలని అందుకు తగినట్లుగా పక్క ప్రణాళిక పొందించాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు.
శనివారం మరిపెడ మున్సిపల్ పరిధిలోని ఆడిటోరియంలో డోర్నకల్ మరిపెడ మున్సిపాలిటీల ప్రణాలికపై డోర్నకల్ శాసనసభ్యులు డి ఎస్ రెడ్యా నాయక్ ఆధ్వర్యంలో సంబంధిత మున్సిపల్ కౌన్సిలర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేటాయింపులకు తగ్గట్లుగా ఖర్చు పెట్టేందుకు పనుల రూపకల్పన జరగాలని అన్నారు నిధులు సమ్మేకరించుకోవడమే కాదని పనులను పూర్తి చేయించుకునే ఆసక్తి కూడా అదే రీతిలో ఉండాలన్నారు డోర్నకల్ మరిపెడ మున్సిపాలిటీలకు కేటాయించిన కోట్ల రూపాయలను ప్రజల అవసరాలను గుర్తించి సీసీ రోడ్స్ , డ్రైన్స్, లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు అదేవిధంగా భవిష్యత్తులో రోడ్ల విస్తరణ అవసరమని ఎక్కడైతే విశాలమైన రోడ్లు ఉంటాయో ఆ రోడ్లను అభివృద్ధి పరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు మున్సిపాలిటీ సమావేశాలకు కార్యాలయం అవసరం తప్పనిసరిగా ఉంటుందని అందులో కౌన్సిలర్ లకు మీటింగ్ హాలు కూడా నిర్మించుకోవాలన్నారు మార్కెట్ ఇండోర్ స్టేడియం నిర్మించుకోగా దోబి ఘాట్ లకు నిధులు కేటాయింపు చేసుకోవడం జరిగిందన్నారు.
భవిష్యత్తు ప్రణాళికలు కూడా అవసరమని లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా భూగర్భ విశాలమైన డ్రైనేజీ అవసరమని అందుకు ముందుగా తక్కువ ఖర్చుతో ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. మున్సిపాలిటీలలో చెత్త సేకరణకు వాహనాలు తప్పనిసరి అన్నారు మినీ ట్యాంకు బండ్ కొరకు ప్రణాళికలు అవసరమని విస్తరణ పనులు బలోపేతం అప్రోచ్ రోడ్డు వంటి పలు పనులకు అవసరమయ్యే నిధులకు పక్కా ప్రణాళిక అవసరం అన్నారు డోర్నకల్ మున్సిపాలిటీలో చెత్త సేకరణకు వాహనాలు అవసరమన్నారు అదేవిధంగా మునిసిపాలిటీల అభివృద్ధికి ఖాళీ ప్రదేశాలుంటే క్రీడా ప్రాంగణాలుగా రూపొందించుకోవాలని మున్సిపల్ స్టేడియాల్ గా అభివృద్ధి పరచుకుంటే యువతకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు మిషన్ భగీరథ పనులకు అవసరమైన ట్యాంకులకు పైపులైన్స్ కు నిధులు ఖర్చు చేసి ప్రజలకు త్రాగునీరు అందించాల్సిన అవసరం ఉందన్నారు డోర్నకల్ మున్సిపాలిటీలో జంక్షన్ లు విస్తరింప చేయాలని ఆర్చి నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు వారంలోగా ప్రతిపాదనలు అందజేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యానాయక మాట్లాడుతూ… మున్సిపాలిటీల అభివృద్ధికి సీసీ రోడ్స్ డ్రైన్స్ త్రాగునీరు విద్యుత్తు వంటి సౌకర్యాలకు నిధులు ఖర్చు చేయవలసిన అవసరం ఉందన్నారు.
గతంలో ఇల్లు లేని వారు కరెంటు వైర్ల పెద్ద నిర్మించుకోవడం వలన లైన్లను మార్చవలసిన అవసరం ఉందన్నారు డోర్నకల్ చెరువు విస్తరణకు చర్యలు తీసుకోవాలని బండ్ నిర్మాణం చేపట్టాలని లైటింగ్ ఏర్పాటు చేయాలని సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా జీవో నెంబర్లు 58, 59ల క్రింద పట్టాల పంపిణీ చేపట్టగా 58 జీవో క్రింద 49 పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
59 జీవో క్రింద 48 పట్టాలు పూర్తి చేయగా అందులో 8 పట్టాలు పంపిణీకి సిద్ధంగా ఉంచి ఒక పట్టాను సభలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు మున్సిపల్ చైర్మన్లు మరిపెడ డోర్నకల్ సింధూర వీరన్న మున్సిపల్ కమిషనర్లు రాజు శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.