మున్సిపాలిటీ అభివృద్ధిని వేగిర పరచండి…

ప్రచురణార్థం

మున్సిపాలిటీ అభివృద్ధిని వేగిర పరచండి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 25.

మున్సిపాలిటీ అభివృద్ధి పనులను వేగిర పరచాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శనివారం మూడు కోట్ల వద్ద మున్సిపాలిటీ రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఇ అభివృద్ధి పనులను కలెక్టర్ కు మ్యాప్ ద్వారా వివరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధిని వేగిర పరచాలని ఆదేశించారు జంక్షన్ పనులు అభివృద్ధి పరచాలని పనుల్లో నాణ్యత ఉండేలా పర్యవేక్షించాలని అన్నారు.

కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి సిబ్బంది పాల్గొన్నారు
————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post