మున్సిపాలిటీ పనుల నిర్వహణకు అదనంగా వాహనాలను కొనుగోలు చేయాలి…జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్.

ప్రచురణార్థం

మున్సిపాలిటీ పనుల నిర్వహణకు అదనంగా వాహనాలను కొనుగోలు చేయాలి…జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్.

మరిపెడ
మహబూబాబాద్ జూలై 7:

పట్టణ ప్రగతి పనులను వేగవంతంగా చేపట్టేందుకు మున్సిపాలిటీలో అదనంగా వాహనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ఆదేశించారు.బుధవారం రెండవ విడత పట్టణ ప్రగతి లో భాగంగా కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర తో కలిసి పట్టణ ప్రగతిని, వైకుంఠ ధామం పనులను, సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ తీరును, మోడల్ మార్కెట్ తో పాటు ఆడిటోరియం నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు.

తొలుత పట్టణంలో పరిశుభ్రత, హరితహారాన్ని పరిశీలించారు. ప్రతి షాపు వద్ద మొక్కలు ఏర్పాటు చేసేందుకు కుండీలను పెట్టించాలని అన్నారు. డివైడర్ లో మొక్కలను చూస్తూ పట్టణానికి సరికొత్త శోభను తెచ్చాయని అన్నారు. పట్టణంలోని వీధులలో పర్యటిస్తూ పరిశుభ్రతను పరిశీలించారు. ఈద్గా స్థలాన్ని పరిశుభ్రం చేయించాలని, ఖాళీ స్థలాల్లో పరిశుభ్రత చేపట్టి క్రీడా మైదానంగా వినియోగించాలన్నారు. డంపింగ్ యార్డ్ ను సందర్శించి పరిశీలించారు. దుర్వాసన వెదజల్లడంతో పౌల్ట్రీ వ్యర్ధాలను వేరు చేయించాలని సెగ్రిగేషన్ చేపట్టాలని చెత్తను రహదారి వెంట పోయించరాదని దూరంగా తరలించాలన్నారు. కోళ్ల వ్యర్ధాల సేకరణను వేరుగా చేపట్టేందుకు వ్యాపారులను సమావేశపరిచి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర కు సూచించారు. ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ చేయించాలని తాసిల్దార్ ను ఆదేశించారు.

అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు కనిపించడం లేదని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నిస్తూ పదవ తేదీ లోపు మొక్కలను నాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. లేఅవుట్ స్థలాలలో కేటాయించిన 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు కేటాయించిన స్థలాలలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకృతి వనాలను కలెక్టర్ సందర్శిస్తూ మొరంతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రకృతి వనాలను పర్యాటకులు సందర్శించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న కూరగాయల మోడల్ మార్కెట్ ఆడిటోరియం నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి సందర్శించి పరిశీలిస్తూ వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు.

ఈ సందర్భంగా పురపాలక సంఘ భవనంలో రెండవ విడత పట్టణ ప్రగతి సమావేశం అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది తో ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ మొత్తం గ్రాంటు, ఖర్చు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కలెక్టర్ కు వివరిస్తూ పట్టణ ప్రగతికి రెండు కోట్లు మంజూరయ్యాయని విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించామని, టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టామని తెలియజేసారు. అలాగే ఇంటింటి చెత్త సేకరణకు మున్సిపాలిటీకి 2 ట్రాక్టర్ లు, 3 ఆటోలు ఉన్నాయని వివరించగా అదనంగా 6 ఆటోలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు గుంతలు త్రవ్విస్తామని, ట్రీ గార్డ్ లను సిద్ధంగా ఉంచుకొని మొక్కలు నాటింప చేసేందుకు చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్ పర్సన్ తెలిపారు. ప్రతి సంవత్సరం ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటుతున్న చెత్త పేరుకోవడం పై మున్సిపల్ సిబ్బంది దృష్టి పెట్టాలన్నారు పట్టణ ప్రగతి లో చేపట్టే ప్రతి పని చేపట్టే ముందు చేపట్టిన తర్వాత ఏ విధంగా ఉన్నదన్నది ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలన్నారు.

ఇంటింటికి అందించే మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు టేకు వేప వంటి మొక్కలు ఇండ్లకు ఇవ్వరాదని తులసి మందార జామ గన్నేరు గోరింట దానిమ్మ ఉసిరి వంటి మొక్కలను అందజేస్తూ నాటుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో నాటే మొక్కలు గుల్మొహర్ కానుగ మొక్కలు ఐదు అడుగులు ఎత్తు ఉండాలన్నారు. మొక్కలు నాటుతున్న ట్లుగా ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూర రవి నాయక్, మున్సిపల్ కమిషనర్ గణేష్, తహసీల్దార్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి మహబూబాబాద్ చే జారీ చేయడమైనది

Share This Post