మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డును, వివిధ కాలనీలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన.      తేది:18.12.2021, వనపర్తి.

కరోనా వ్యాప్తి నుండి రక్షణ కొరకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని డిసెంబర్ 31వ. తేదిలోపు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శనివారం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డును, వివిధ కాలనీలను సందర్శించి,  ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులలో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించి, వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని, మున్సిపల్ సిబ్బందికి, వైద్య అధికారులకు, అంగన్వాడి, ఆశా వర్కర్లు, కౌన్సిలర్లు సమన్వయంతో రోజువారి ప్రణాళికలు తయారుచేసి, దాని ప్రకారం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ఆయన సూచించారు.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన వారందరికీ అవగాహన కల్పించి మొదటి, రెండవ వాక్సినేషన్ డోసులు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆయన మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రెండవ డోసు కు అర్హులుగా వున్న వారి జాబితాను తయారు చేసి, దాని ప్రకారం షాపులు వారీగా, అదే విధంగా ఇంటింటికీ వెళ్ళి వ్యాక్సినేషన్ చేయాలని, డిసెంబర్ 31వ తేదీ లోపు 100 శాతము వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆయన వివరించారు. వనపర్తి జిల్లాను 100 శాతం వ్యాక్సినేషన్ జిల్లాగా మార్చుటకు వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ప్రజల సహకారంతో సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ వెంట డి డబ్ల్యూ ఓ పుష్పలత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post