మున్సిపాలిటీ పరిధిలోని 6, 7, 8, 23 వార్డులలో గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు : రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి

పత్రికా ప్రకటన.   తేది:30.12.2021, వనపర్తి.

ప్రభుత్వం గ్రామాభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
గురువారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 6, 7, 8 వార్డులలో గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని పానగల్ రోడ్డు సమీపంలో గల స్మశాన వాటిక నుండి పీర్ల గుట్ట నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయం వరకు గల సి.సి. రోడ్డుకు రూ.1 కోటి నిధులతో మంత్రి శంకుస్థాపన నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా 23 వ వార్డు లోని జమ్ములమ్మ దేవాలయానికి రూ.5 లక్షలతో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి వివరించారు.
మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా అధికారులు, కౌన్సిలర్ శ్యామ్, ఆయా వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post