మున్సిపాలిటీ లలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి:స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ

పత్రికా ప్రకటన
మున్సిపాలిటీ లలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి:స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నల్గొండ, సెప్టెంబట్ 13.మున్సిపాలిటీ లలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు,పట్టణ ప్రగతి పనులు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్ లు,పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.మున్సిపాలిటీల లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ లు,వైకుంఠ దామం నిర్మాణం కొరకు మున్సిపల్ కమిషనర్ లు,రెవెన్యూ శాఖ సహకారం తో స్థలాలు గుర్తించాలని,గుర్తించి న స్థలం నిర్మాణం లు మొదలు పెట్టటానికి పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖకు అప్పగించాలని అన్నారు.మున్సిపాలిటీ ల్లో పట్టణ ప్రకృతి వనం లు,ప్రతి మున్సిపాలిటీ లో ఒక బృహత్ పట్టణ ప్రకృతి వనం లు గుర్తించిన చోట పనులు వేగవంతం చేయాలని సూచించారు.మున్సిపాలిటీ లలో త్రాగు నీరు సరఫరా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం డిమాండ్,సరఫరా,వచ్చే 30 సంవత్సరం లకు సరఫరా, డిమాండ్ గురించి రిపోర్ట్ అంద చేయాలని అన్నారు.
మెప్మా ద్వారా వీధి వ్యాపారుల రుణం మంజూరు సమీక్షించి లబ్ధిదారులకు రుణం మంజూరు చేయాలని అన్నారు.పురపాలన, పట్టణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ ఆదేశాల నముసరించి మెప్మా సిబ్బంది ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పరిధి లో పనిచేయాలని తెలిపారు.ఈ సమావేశం లో పబ్లిక్ హెల్త్ ఎస్.ఈ. కందుకూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Share This Post