slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

*మున్సిపాలిటీ లలో అభివృద్ది పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు చేపట్టాలి*. #:*మున్సిపాలిటీలలో అభివృద్ది పనుల పై సమీక్షించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్*. – Information and Public Relations Department, Government of Telangana

*మున్సిపాలిటీ లలో అభివృద్ది పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు చేపట్టాలి*. #:*మున్సిపాలిటీలలో అభివృద్ది పనుల పై సమీక్షించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్*.

మున్సిపాలిటీ లలో చేపట్టిన అభివృద్ధి పనులు నాణ్యతా ప్రమాణాల ననుసరించి చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశం లో మున్సిపాలిటీ లలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీలలో అభివృద్ధి పనుల నాణ్యత పై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితి లో రాజీ పడవద్దని  ఆమె స్పష్టం చేశారు.  ప్రతి మున్సిపాలిటీలో చేపట్టిన ఇంటి గ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం మార్చి 31 లోగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.దేవరకొండ మున్సిపాలిటీ లో స్థలం కోర్టు లో ఉన్నందున కోర్టు ఆదేశాల ననుసరించి   ప్రత్యామ్నాయ స్థలం గుర్తించి వెంటనే పనులు చేపట్టాలని,అదే విధంగా చండూరు మున్సిపాలిటీ లో కూడా స్థలం గుర్తించి పనులు చేపట్టాలని ఆమె ఆదేశించారు.  మున్సిపాలిటీలలో పట్టణ ప్రకృతి వనం లు ఇంకా పనులు చేపట్టని చోట స్థలం గుర్తించి పట్టణ ప్రకృతి వనం లు,బృహత్ పట్టణ ప్రకృతి వనం లు  ఏర్పాటుకు  చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటడంతోపాటు, నాటిన మొక్కలను వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.  అత్యాధునిక దోబీ ఘాట్లు నిర్మాణం కు మున్సిపాలిటీలో కనీసం 500 చదరపు  గజాలు తగ్గకుండా స్థలాన్ని గుర్తించి నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కు కూడా స్థలాలను గుర్తించాలని అన్నారు.మున్సిపాలిటీ లో హెయిర్ సెలూన్ ల  డాటా కూడా సిద్ధం చేసి ఉంచాలని అన్నారు. ప్రతి మున్సిపాలిటీలో డిజిటల్ డోర్ తో ప్రతి ఇంటికి యూనిక్ నెంబర్ కేటాయింపు చేయాలని అన్నారు. డంప్ యార్డ్ లలో సేకరించిన చెత్త వ్యర్థాల ద్వారా బయో మైనింగ్ చేపట్టాలని అన్నారు.పేదలకు వైద్య సేవలు అందించే బస్తీ దవాఖానా ల పనులు నల్గొండ,మిర్యాలగూడ పట్టణం లలో పనులు మొదలైనట్లు,మిగతా చోట్ల కూడా వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు.మున్సిపాలిటీ లలో ఆస్తి పన్ను వసూలు పై సమీక్షించారు మానవ వ్యర్థాల శుద్దీ కరణ కేంద్రం లు మిర్యాలగూడ,దేవర కొండ లో పనులు మొదలు పెట్టాలని,5 మున్సిపాలిటీ లలో స్థలం గుర్తించి డిజైన్ లు కూడా ఖరారు చేసినట్టు,వెంటనే పనులు ప్రారంభించాలని ఆమె సూచించారు.ఈ సమావేశం లో టి.యు.ఎఫ్. ఐ.డి.సి.ఎస్.ఈ. కందుకూరి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు

*మున్సిపాలిటీ లలో అభివృద్ది పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు చేపట్టాలి*. #:*మున్సిపాలిటీలలో అభివృద్ది పనుల పై సమీక్షించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్*.

Share This Post