మున్సిపాలిటీ లలో మిషన్ భగీరథ తాగు నీరు ఇచ్చేందుకు డిమాండుకు తగ్గట్లు సప్లై చేసే విధంగా పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మున్సిపాలిటీ లలో మిషన్ భగీరథ తాగు నీరు ఇచ్చేందుకు డిమాండుకు తగ్గట్లు సప్లై చేసే విధంగా పకడ్బందీగా ప్రణాళికలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల ను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ హాల్లొ అన్నీ మున్సిపాలిటీల అధికారులు, ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా, క్రిమిటోరియం, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ మంచినీటి సరఫరా ఎప్పటి లోగా చేస్తారు ప్రణాళికలు ఏ విధంగా ఉన్నాయి అనే వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి.24 గంటల నీరు ఇచ్చేవిధంగా ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, ఒక్కో ట్యాన్క్ నుండి ఎంత మందికి నీళ్లు ఇవ్వొచ్చు, గ్రావిటీ ఎలా ఉంటుంది, ఒకే విధమైన ఫ్లో అందరికి ఎలా వెళుతుంది అనేది పక్కాగా ప్రణాళికలు చేసుకోవాలన్నారు. ఫ్లో మీటర్లు ఎన్ని ఎక్కడ పెడుతున్నారు అనేది పూర్తి వివరాలతో రావాల్సిందిగా ఆదేశించారు. డిసెంబర్, చివరి వారం నాటికి అన్ని మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ నీరు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. క్రిమిటోరియం , సమీకృత మార్కెట్ భవనాలు నిర్మాణం ఎంతవరకు వచ్చాయని ఆరా తీశారు. వెంటనే పనులు ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీ ల్లో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి నుండియే వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకటనల పై ట్యాక్స్, ట్రేడ్ లైసెన్సు ట్యాక్స్, అద్దె రికవరీ పై ఆరా తీశారు. వంద శాతం ట్యాక్స్ వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలు చేసిన వాటికి, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలకు నోటీస్ లు జారీ చేసి జరిమానాలు వసూలు చేయాల్సిందిగా ఆదేశించారు. ఆక్రమణలు తొలగించాలని, అనుమతులు లేని వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మనుంచౌదరి, టౌన్ ప్లానింగ్ డి.ఈ. శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్లు, ఏ.ఈ.లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post