మున్సిపాలిటీ లో 24 గంటలు శుద్ధమైన మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మున్సిపాలిటీ లో 24 గంటలు శుద్ధమైన మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల కమిషనర్ లు, పబ్లిక్ హెల్త్ కార్యనిర్వాహక ఇంజనీరుతో కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీలలో జరుగుచున్న అభివృద్ధి కార్యక్రమాలు అవి ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి, ఒక వేళ పెండింగ్ లో ఉంటే వాటికి గల కారణాలు ఏంటి, జరుగుచున్న పనులు ఎప్పటి లోగా పూర్తి చేస్తారు అనే అంశాల పై మున్సిపాలిటీ వారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి ఇస్తున్న త్రాగు నీరు 24 గంటల పాటు ఇస్తే నీటి వినియోగం తగ్గి ఆదా అవుతుందని తెలియజేసారు. అందుకు ముందుగా ప్రతి ఇంటికి కొళాయి బిగించి ఉండాలని, ఎక్కడా లీకేజీల లేకుండా చూసుకొని ప్రజలకు ప్రజాప్రతినిధుల ద్వారా అవగాహన కల్పించాల్సి ఉంటుందన్నారు. ఆయా మున్సిపాలిటీ ల వారిగా మించి నీటి సరఫరా ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, స్టోరేజ్ రిజర్వాయర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కొల్లాపూర్ మున్సిపాలిటికి పూర్తి స్థాయి అవకాశాలు ఉన్నందున అక్కడ ముందుగా 24 గంటలు శుద్ధ జలాన్ని అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఫ్లో వాల్స్ ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నీటి వృధా ఎక్కడ అవుతుందో కనిపెట్టి తక్షణ చర్యలు తీదుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా నీటి సమస్యలు ఉన్నాయ అని అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి ద్వారా చేపడుతున్న పనుల పై సమీక్షిస్తూ సమీకృత మార్కెట్లు, సెగ్రిగేషన్ షేడ్ల్ నిర్మాణం, వైకుంఠ ధామం వంటి అభివృద్ధి కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమీకృత మార్కెట్లకు అవసరమైన స్థలాన్ని గుర్తించి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వీధి వ్యాపారస్తులకు రోడ్డు పక్కన అవసరమైన స్థలాన్ని గుర్తించి షాపుల నిర్మాణం చేపట్టాలని, పూర్తి అయిన వెంటనే వీధి వ్యాపారులను అందులోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ సుందరికరణలో భాగంగా రోడ్డు సైడ్ లైటింగ్ ఏర్పాటు, పాదచారులకు ఫుట్ పాత్ ఏర్పాటు చేయడం పై దృష్టి సారించేసులన్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా ఎక్కడ చెత్త చెందారు లేకుండా చూడాలని ఆదేశించారు. దోమలను అరికట్టడానికి చేపట్టాల్సిన అన్ని చర్యలను సకాలంలో చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ ఈ.ఈ. విజయ్ భాస్కర్ రెడ్డి, డి.ఈ, మున్సిపల్ కమిషనర్లు, ఏ.ఈ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post