మున్సిపాలిటీ సాలిడ్ వేస్టు ద్వారా విద్యుత్తు ఉత్పత్తి
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని వసతులు
జవహార్ నగర్ కాలనీలో అభివృద్దికి మరిన్ని సౌకర్యాలు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని జవహార్ నగర్, దమ్మాయిగూడ, కుషాయిగూడ, సైనిక్ పూరి ప్రాంతాల్లో రాష్ట్ర మున్సిపాల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఆ ప్రాంత ప్రజలకు డంపింగ్ యార్డుల ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పాటు రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ లో వారితో పర్యటించారు. జవహార్ నగర్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు డ్రోన్లు, ప్రత్యేక పైప్లైన్లను వేసి వాటి ద్వారా అవసరమైన చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేపటి (ఆదివారం) నుంచి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతామని ఈ విషయంలో ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అలాగే మల్కారం చెరువుతో పాటు మరో ఎనిమిది తాత్కాలిక చెరువులకు సంబంధించి తాము ప్రత్యక్షంగా త్వరలోనే పరిశీలిస్తామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.280 కోట్లతో ఆయా పనులకు సంబంధించి ప్రాజెక్టులు రూపొందించామని దీనికి సంబంధించిన విధివిధానాలు పురోగతి ఉన్నాయని అరవింద్ కుమార్ తెలిపినారు . అలాగే డంప్ యార్డ్ కి సంబంధించి రూ.146 కోట్లతో క్యాపింగ్ చేయడంతో సీఎన్జీ, సీపీజీ గ్యాస్ తయారీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని నాలుగువైపుల డంపింగ్ యార్డులకు స్థలాలను గుర్తిస్తున్నామని ఇప్పటికే లక్డారం ప్రాంతంలో 120 ఎకరాలు, గ్యారీ నగర్లో 150 ఎకరాలు గుర్తించగా మరికొన్ని చోట్ల గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పట్టణానికి దూరంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు. జిల్లాలోని జవహార్ నగర్ కాలనీలో రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ అండ్ డిస్ప్లే ప్లాంట్ ఫర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ సాలిడ్ వేస్టు ద్వారా రాబోయే రోజుల్లో 48 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా చేస్తుండగా ప్రస్తుతం 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి జరుగుతోందని మరో 28 మెగావాట్ల విద్యుత్తును రానున్న 18 నెలల్లో ఉత్పత్తి చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అరవింద్ కుమార్ వివరించారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రతినిత్యం ఏడువేల నాలుగు వందల టన్నుల చెత్త వస్తోందని దీనిలో జీహెచ్ఎంసీ నుంచి 6,800 టన్నులు, మిగిలిన 9 మున్సిపాలిటీల నుంచి 600 టన్నుల చెత్త తో ఈ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
ఈ విషయంలో మంత్రుల ఆదేశాలతో సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారని దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కానుందని జీహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి నిర్మాణాత్మక పనులు చేపట్టడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ సందర్భంగా కంపోస్టు, చెత్త సేకరణతో పాటు మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ను పరిశీలించారు. దీంతో పాటు జవహార్ నగర్ పరిధిలోని సీఎన్జీ గ్యాస్తో పాటు 20 మెగా వాట్ల పవర్ ప్లాంట్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకొన్నారు. అలాగే మున్సిపాలిటీ సాలిడ్ చెత్త ద్వారా దుండిగల్లో 15 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి పనులు జరుగుతున్నాయని 2022 జూన్ 5వ తేదీ నాటికి అక్కడ పూర్తి స్థాయిలో విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుందని ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వివరించారు ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండి వారికి పనులు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో
దమ్మైగూడ కమిషనర్ ప్రణీత గౌడ్ జోహార్ నగర్ మేయర్ మేకల కావ్య రాంకీ సిబ్బంది పాలొగొన్నారు ఆయా శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.