మున్సిపాల్టీలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ సమావేశపు హాలు నుండి పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ ఛైర్మన్లు, కమిషనర్లు, డిఈ, ప్రజారోగ్య శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పారిశుద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి అన్ని మున్సిపాల్టీలో ప్రతి ఇంటి నుండి నూరు శాతం చెత్తసేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. చెత్త సేకరణ ప్రక్రియ ఎంతో ప్రాధాన్యమైన అంశమని చెప్పారు. చెత్త సేకరణ ప్రక్రియ ఏవిధంగా జరుగుతున్నదని మున్సిపల్ కమిషనర్లును అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెంలో 67 శాతం, ఇల్లందులో 95 శాతం, పాల్వంచ 76లో శాతం, మణుగూరులో 40లో శాతం ఇంటింటి నుండి చెత్త సేకరణ జరుగుతున్నట్లు చెప్పారు. ప్రతి డిఆర్సిసిలో చెత్త వేరుచేయు ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. వార్డుల వారిగా చెత్తను వర్మి తయారు చేయుటకు టెట్రా వర్మి బెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. చెత్త సేకరణ తక్కువుగా జరుగుతున్న వార్డులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కౌన్సిలర్లును భాగస్వాములను చేయాలని చెప్పారు. కొత్తగూడెం పట్టణంలోని పంచతంత్ర, రాజీవ్ పార్కుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. మున్సిపాల్టీలలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ, మొక్కలు సంరక్షణకు నిరంతరం జరగాలని చెప్పారు. అవెన్యూ ప్లాంట్ కేర్ను కొనసాగించి మొక్కల సంరక్షణ చేపట్టాలని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ భాగంగా సెప్టిక్ ట్యాంకులను జియో ట్యాగింగ్ చేయాలని చెప్పారు. సెప్టిక్ ట్యాంకులు జియో ట్యాగింగ్ ప్రక్రియను నూరు శాతం పూర్తి చేసిన మున్సిపల్ కమిషనరు, సిబ్బందిని అభినందించారు. పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఈపిఎఫ్ మినహాయింపులు చేయాలని, ఈపిఎఫ్ నెంబర్లు కేటాయించాలని, అట్టి వివరాలను రిజిష్టరులో నమోదులు చేయాలని చెప్పారు. పారిశు ద్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. అన్ ఆర్గనైజ్డ్ సిబ్బంది వివరాలు ఈ శ్రమ పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్లును అడిగి తెలుసుకున్నారు పనులను వేగవంతం చేయాలని నిర్మాణంలో జాప్యం చేసే కాంట్రాక్టర్లుకు నోటీసులు జారీ చేయాలని, బ్లాక్ లిస్టులో పెట్టాలని చెప్పారు. ప్రజల ఉపయోగం కొరకు చేపట్టిన పనులు జాప్యం చేసే కాంట్రాక్టర్లు మనకు అవసరం లేదని భవిష్యత్తులో కూడా వారికి పనులు అప్పగించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మున్సిపాల్టీలలో గ్యాస్ బేసెడ్ క్రిమటోరియాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ క్రిమటోరియాలు ఏర్పాటు వల్ల అంతిమ కార్యక్రమాలు నిర్వహణకు కట్టెలకు చెట్లు కొట్టాల్సిన అవసరం ఉండదని, పైగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని చెప్పారు. వైకుంఠ దామాల్లో నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం ఉండాలని సమస్యలుంటే తన దృష్టికి తేవాలని చెప్పారు. మణుగూరు మున్సిపార్టీ పరిధిలోని కమలాపురం, చిన్నరావిగూడెంలో మంచినీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇండ్ల నిర్మాణ సమయంలోనే పటిష్ట పర్యవేక్షణ జరగాలని, టాస్క్ఫోర్సు, టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టిన యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు తొలగింపు ప్రక్రియను చేపట్టాలని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు మున్సిపాల్టీలలో ఇండోర్ షటిల్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, కోర్టులు ఏర్పాటు ప్రతిపాదనలు అందచేయాలని చెప్పారు. పాల్వంచలో గ్రంథాలయ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, డిజైన్ రూపకల్పన చేసి తనకు నివేదికలు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పాల్వంచలో సెంట్రల్ లైటింగ్ పనులు గురించి ప్రస్తావిస్తూ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుందని, కాంట్రాక్టర్ జాప్యం చేస్తున్నారని మున్సిపల్ కమిషనర్ చెప్పగా అతని కాంట్రాక్టు రద్దు. చేసి మరొక కాంట్రాక్టరుతో పనులు చేపించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

 

ఈ సమావేశంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, శ్రీకాంత్, అంజన్ కుమార్, నాగప్రసాద్, ప్రజారోగ్య శాఖ డిఈ నవీన్, మున్సిపల్ డిఈలు నవీన్, మురళి, పారిశుధ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post