మున్సిపాల్టీలలో సమీకృత మార్కెట్లు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ మున్సిపల్ కమిషనర్లును ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మున్సిపల్ ఛైర్మన్లు, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వార్డుల వారిగా వ్యర్ధాలు సేకరణను అడిగి తెలుసుకున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ప్రతి ఇంటి నుండి వ్యర్థాల సేకరణ జరగాలని చెప్పారు. కొత్తగూడెంలో 42 శాతం, పాల్వంచలో 70, మణుగూరులో 90 శాతం, ఇల్లందులో 95 శాతం వ్యర్ధాల సేకరణ జరుగుతున్నదని చెత్త సేకరణ ప్రక్రియపై కౌన్సిలర్లుకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రత్యేక అధికారులు వ్యర్థాల సేకరణ ప్రక్రియను నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఇండ్ల నుండి వెలువడుతున్న వ్యర్థాలను ఆయా వార్డుల్లోనే వర్మి తయారు చేయుటకు ప్రతి వార్డులో టెట్రావర్మి కంపోస్టు బెడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. కంపోస్టు కేంద్రాల సమాచారాన్ని ప్రజలు తెలుసుకునే విధంగా సైన్బోర్డు ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణకు ప్రత్యేకంగా బాద్యులను నియమించాలని చెప్పారు. హెూటళ్లు నుండి వెలువడుతున్న కూరగాయల వ్యర్ధాలను గో శాలలకు కానీ పశువుల యజమానులకు కానీ అప్పగించు విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. దీనివల్ల పశువులకు మేత లభిస్తుందని చెప్పారు. చికెన్, మటన్, చేపల వ్యర్థాలు సేకరణకు ఏజన్సీని ఎంపిక చేసి వ్యర్థాల సేకరణ చేయు విధంగా చేయాలని చెప్పారు. తొలగించిన ఇండ్ల మెటీరియల్ తిరిగి వినియోగంచుటకు కావాల్సిన పరికరాలపై ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. డంపింగ్ యార్డుల్లో వ్యర్థాలు వేరుచేయుటకు కన్వేయర్ బెల్టు ఏర్పాటు చేయాలని, వ్యర్థాలను కంప్రెష్ చేసేందుకు బెయిలింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. మానవ వ్యర్ధాలను డ్రెయిన్లులో వదులున్న ఇంటి యజమానులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని చెప్పారు. నిర్ణీత సమయంలోగా పిట్ నిర్మించుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పన్నుల వసూళ్ల ప్రక్రియను జనవరి మాసాంతం వరకు నూరు శాతం పూర్తి చేయాలని చెప్పారు. మానవ వ్యర్థాలను ఎరువుగా తయారు చేయుటకు చేపట్టిన ఎఫ్ఎస్ఎపి నిర్మాణాలను వేగవంతం చేయాలని చెప్పారు. మణుగూరు బృహత్ పల్లె పకృతి వనం నిర్వహణ సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్లో నీడను ఇచ్చే చెట్లును నాటాలని చెప్పారు. పట్టణాలు మారాలి. స్వచ్చతను సాధించాలన్న సంకల్పం ఉ ండాలని చెప్పారు. మున్సిపాల్టీలలో మంచినీటి సమస్య రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని చెప్పారు. టిఎస్బిపాస్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత అనుమతులు లేకుండా నిర్మించిన ఇండ్లపై నివేదికలు అందచేయాలని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్ధం పట్టణాల్లోని సిటిబస్ స్టాండులను ఆధునీకరించి సురక్షిత మంచినీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. కొత్తగూడెం అంబేద్కర్ కూడలిలో విద్యుద్దీకరణ చేయాలని చెప్పారు. పుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడంతో పాటు వెడల్పు చేసి పాదచారులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. స్వచ్చ మున్సిపాల్టీలుగా తయారు చేయుటలో భాగంగా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేసే వ్యక్తులకు జరిమాన విధించాలని చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులు అర్జున్, పురందర్, అలీం, మున్సిపల్ కమిషనర్లు సంపత్ కుమార్, అంజన్ కుమార్, శ్రీకాంత్, నాగప్రసాద్, డిఈలు నవీన్ కుమార్, మురళి, ప్రజారోగ్యశాఖ డిఈ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post