ములుగు,భూపాలపల్లి జిల్లాలు గొప్ప పర్యాటక కేంద్రాలుగా విలసిల్లు తాయని ఇందుకు నిదర్శనం పాండవులగుట్ట, రామప్ప దేవాలయం

* ప్రచురణార్థం * ములుగు జిల్లా
నవంబర్ 21 ఆదివారం
భూపాలపల్లి, ములుగు జిల్లాలు గొప్ప పర్యాటక కేంద్రాలుగా విలసిల్లు తాయని” ఇందుకు నిదర్శనం పాండవులగుట్ట, రామప్ప దేవాలయం అని హైదరాబాదు నుండి సొసైటీ టు సేవ్ రాక్స్ ఎన్జీఓ తరపున 20 మంది పర్యాటక బృందం పేర్కొన్నారు
ఆదివారం రోజున భూపాలపల్లి పాండవులగుట్ట పర్యాటక ప్రదేశం మరియు ములుగు జిల్లా రామప్ప దేవాలయం పర్యాటక ప్రదేశాలను హైదరాబాదు నుండి సొసైటీ టు సేవ్ రాక్స్ ఎన్జీఓ తరపున 20 మంది పర్యాటక బృందం
సందర్శించారు. ముందుగా పాండవులగుట్ట ను సందర్శించి పర్యాటక బృందం మాట్లాడుతూ.పాండవుల గుట్ట చాలా బాగుందని గుట్ట లోరాళ్లు కేవలం జీవరహితమైన ప్రకృతి సౌందర్య నిదర్శనాలు కావు- అవి లెక్కలేనన్ని జీవకోటికి ఆశ్రయాలు.” అన్నారుప్రపంచ నలు ములల నుండి ప్రకృతి ప్రేమికులు ప్రపంచ వ్యాప్తంగా ఈ జిల్లా లోని ప్రకృతి అందాలను తిలకించుటకు తాడోప తడాలుగా , పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉన్నాయని కొనియాడారు
ములుగు జిల్లా పర్యాటక రంగంలో అగ్రగామిగానున్న రామప్ప దేవాలయానికి ఈ మద్యన యునెస్కో గుర్తింపు రావడం మన అందరికీ తెలిసిన విషయమే అన్నారు. కాకతీయుల తీర్చిదిద్దిన అద్భుత శిల్ప సంపదకు చిరునామా రామప్ప దేవాలయం అని అన్నారు.ఇందులో భాగంగా రామప్ప దేవాలయం ప్రాముఖ్యతను గైడ్ విజయ్ వారికి అర్థవంతంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్జీఓ సెక్రటరీ ఫ్రాక్ క్వాడర్ మాట్లాడుతూ రామప్ప దేవాలయం అద్భుతంగా ఉందని, కాకతీయుల శిల్ప కళా నైపుణ్యాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య , అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి ,వారి యంత్రాంగం ఇచ్చిన సపోర్ట్ కి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఆర్వో రమాదేవి గారు మాట్లాడుతూ రామప్ప కి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరం అని వారు అన్నారు

ఈ కార్యక్రమం లో జిల్లా పౌర సంబంధాల అధికారిణి ప్రేమలత, వెంకటాపూర్ తహసిల్దార్ మంజుల, ఎన్జీఓ వైస్ ప్రెసిడెంట్ అపరాజిత సింహా,జాయింట్ సక్రటరీ సంగీత వర్మ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………..
.

Share This Post