ములుగు జిల్లా పర్యటన నేపథ్యంలో గట్టమ్మ తల్లి దేవాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ములుగు జిల్లాలో నూతనంగా నిర్మించనున్న సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం (కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌) స్థలాన్ని మంగళవారం రోజు రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్ ,ఎస్పీ గౌస్‌ అలంతో కలసి పరిశీలించారు .భవన నిర్మాణ స్థలం మ్యాప్‌ను పరిశీలించి ఇంజినీరింగ్‌ అధికారులతో సమావేశమై కాంప్లెక్స్‌ నిర్మాణ ప్రత్యేకతలను మంత్రి సత్యవతి రాథోడ్ తెలుసుకున్నారు.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

Share This Post