మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్.

ప్రచురణార్ధం

మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథోడ్.

మహబూబాబాద్, ఆగస్ట్-15:

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక ఎన్.టి.ఆర్. స్టేడియంలో  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామాత్యులు సత్యవతి రాథొడ్  ఉదయం 10-30 గంటలకు పతాకావిష్కరణ గావించారు.  పరేడ్  పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని, బడ్జెట్ లో కేటాయించిన నిధులకు అదనంగా ప్రజారోగ్యానికి 10 వేల కోట్ల రూపాయలను సి.ఎం. ప్రకటించారన్నారు.  గిరిజనులు ఎక్కువగా ఉన్న జిల్లాలో మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు అన్ని రకాల వైద్య సౌకర్యాలను, సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.  జిల్లా కేంద్రంలోనే 59 రకాల పరీక్షలను ఉచితంగా జరిపేందుకు 2.73 కోట్ల రూపాయలతో టి. డయాగ్నస్టిక్ కేంద్రాన్ని ఇటీవలే ప్రారంభించుకున్నామని అన్నారు.  

గత పాలకులు వ్యవసాయం దండగ అంటే, ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఎస్సేరెస్పి  కాలువల ద్వారా చెరువులు నింపి పుష్కలమైన సాగునీరుఅందించి, రైతుబంధు, రైతుబీమా వంటి రైతు సంక్షేమ పథకాలు అమలుచేస్తూ వ్యవసాయాన్ని పండగ చేశారన్నారు.   

దురదృష్టవశాత్తు రైతు కుటుంబంలో పెద్దదిక్కుమరణిస్తే పెద్దకర్మలోగా రైతుబీమా కింద 5 లక్షల రూపాయలు అందిస్తూ ఆ కుటుంబానికిప్రభుత్వం అండగా నిలుస్తున్నదని, పోడు చేస్తున్న వ్యవసాయ భూముల్లో ఆర్.ఓ.ఆర్ పట్టాలున్న వారికి కూడా రైతుబంధు ఇస్తూ రైతులను ఆదుకుంటున్నామని, త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని సిఎం కేసిఆర్ స్వయంగా హామీ ఇచ్చారన్నారు.  రైతు రుణభారాన్ని తగ్గించేందుకు మొదటి దశలో 25వేలలోపు రుణమాఫీ చేశారని, దీనివల్ల 8343 మంది  లబ్ది పొందారని తెలిపారు. రెండో విడతలో 50వేల లోపు రూపాయల రుణమాఫీని ప్రకటించారని, రేపటి నుంచి ఈ రుణమాఫీ అమలు కానుందని తెలిపారు. దీనివల్లజిల్లాలో 15,364 మంది కి లబ్ది చేకూరనుందని తెలిపారు. గ్రామాలేదేశానికి పట్టుకొమ్మలన్న గాంధీజీ స్పూర్తితో ముఖ్యమంత్రి కేసిఆర్ పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టి, గ్రామ పంచాయితీలకు నిధులిచ్చి గ్రామ వికాసానికి కృషి చేస్తున్నారని,  పల్లెప్రగతి ద్వారా తెలంగాణలోని 12 వేల 769  పంచాయతీలలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్,ట్యాంకర్, ట్రాలీ ఇచ్చి పల్లెల్లో పచ్చదనం,పరిశుభ్రత, పారిశుద్ధ్యం కోసం పాటుపడుతున్న రాష్ట్రంగా రికార్డు నెలకొల్పిందని తెలిపారు.  

 మన జిల్లాలో ఉన్న 461 గ్రామ పంచాయితీలలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఇచ్చామని, తద్వారా గ్రామాల్లో పరిశుభ్రతపాటిస్తూ అంటువ్యాధులు ప్రభలకుండా అరికడుతున్నామన్నారు. 702 పల్లెప్రకృతి వనాలు పూర్తి చేశామని, ప్రతి మండలంలో 10 ఎకరాలలోబృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. మునిసిపాలిటీలుఅంటే మురికికూపాలు అన్న నానుడిని మార్చి ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలోపట్టణ ప్రగతి ద్వారా పురపాలికలను ప్రగతి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.  మాంసం, కూరగాయలు,పండ్లు, పూలు ఒకేచోట  లభించే విధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు డొర్నకల్, మరిపెడ, తొర్రూర్ మునిసిపాలిటీలలో కూడా ఇంటిగ్రేటెడ్మార్కెట్ లు ఏర్పాటు చేసుకుంటున్నామని, రహదారుల విస్తరణతో పాటు డివైడర్స్,సెంట్రల్ లైటింగ్, చిల్డ్రన్పార్కులు, ప్రజా మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించడంతో జిల్లా కేంద్రాన్ని సమగ్రంగాఅభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.
 అంతరించిపోతున్నఅడవులను సంరక్షించి, భవిష్యత్తరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించేందుకు ప్రారంభించిన హరితహారం రాష్ట్రంలో 24శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 28 శాతానికి పెంచి రికార్డు సృష్టించిందని, పట్టణాల్లో పచ్చదనం కచ్చితంగా పెంచాలని మునిసిపాలిటీల బడ్జెట్ లో 10శాతం నిధులుదీనికి కేటాయించడం హరితహారానికి సిఎం కేసిఆర్ ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శమని అన్నారు.  సాగునీరు లేక నెర్రెలు పారిన తెలంగాణను కేసిఆర్సిఎం అయ్యాక అపర భగీరథ ప్రయత్నంతో ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మితకాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు.ప్రాజెక్టుల రీడిజైనింగ్ ద్వారా తెలంగాణ సాగునీటి చిత్రాన్ని మార్చి, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ చేపట్టి, నాతెలంగాణ కోటి ఎకరాల మాగాణి అన్న మాటలను చేతల్లో చేసి చూపిన గొప్ప లక్ష్య సాధకులుముఖ్యమంత్రి కేసిఆర్ అని, నేడు తెలంగాణలో ఎండాకాలంలో కూడా చెరువులు మత్తడి పోస్తూనిండుకుండలను తలపిస్తుంటే, రైతు గుండెలు ఆనందంతో నిండి పొంగుతున్నాయని, మిషన్కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగి, భూగర్భజలాలుగణనీయంగా పెరిగాయన్నారు. గతంలో రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగానే పరిమితమైన గిరిజనులుతెలంగాణ రాష్ట్రంలో సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నారని, తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న దీర్ఘకాలిక డిమాండ్ సిఎం కేసిఆర్ నాయకత్వంలో నెరవేరి గిరిజనుల 4 వేల 61 వారి తండాలు, గూడాలను వారేపాలించుకునే గొప్ప అవకాశం లభించిందన్నారు.   గిరిజనుల విద్యకు అత్యంత ప్రాధాన్యతఇచ్చిన ప్రభుత్వం కొత్తగా 70 గురుకుల పాఠశాలలు, 22 గురుకులడిగ్రీ కాలేజీలు పెట్టి రాష్ట్రంలో 188 ఎస్టీ గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యకుఅవకాశం కల్పిస్తోందని,  తెలంగాణలో ప్రత్యేకంగా గిరిజన రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్, లా కాలేజీ, పిజి.కెమిస్ట్రీ కాలేజీలు సాధించుకుని ప్రారంభించుకున్నామన్నారు. గిరిజన విద్యార్థులు సివిల్ సర్వీసులు సాధించేలా  ప్రత్యేక స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్నామని,  సిఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పథకం కింద 50 లక్షలరూపాయల సబ్సిడీ ఇస్తూ, ఐఎస్బీవంటి ప్రతిష్టాత్మక సంస్థలో శిక్షణఇస్తూ గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నామని అన్నారు.

 మంత్రి గిరివికాసం, మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమం, బాలల హక్కులు,  విద్యా శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమలు, పౌర సరఫరాలు, డబుల్ బెడ్రూం, మిషన్ భగీరథ, ధరణి, సంక్షేమం, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఉద్యానవనం, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్,  వెనకబడిన తరగతుల అభివృద్ధి కొరకు తీసుకుంటున్న చర్యలపై, పశు వైద్యం, పశు సంవర్ధక కార్యక్రమలపై, మత్స్య శాఖ, రహదారులు, భవనాలు, దఌతబంధు పథకం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. 

అనంతరం వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కోవిడ్-19, సీజనల్ వ్యాధులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు వివరాలతో కూడిన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించిన శకటాన్ని, ఐ.సిడి.ఎస్. కార్యక్రమాలు, సమగ్ర బాలల పరిరక్షణ విభాగం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, జిల్లాలో వివిధ రకాల హింసలకు గురవుతున్న మహిళలకు సఖీ ద్వారా చేపడుతున్న రక్షణ, వైద్య, కౌన్సిలింగ్, పోలీసు సహాయం, న్యాయ సహాయం, తాత్కాలిక్ వసతి వివరాలతో కూడిన సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై శకటాన్ని, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా  ఈ-స్కూల్స్, కంప్యూటర్ ల్యాబ్, గిరిబాల ఆరోగ్య రక్ష, కరదీపత్ శిక్షన కార్యక్రమం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. రైతుబంధు, జి.సి.సి. పెట్రోల్ బంకు, గ్రామీణ రవాణ, AVON స్కాలర్ షిప్స్, గిరివికాసం, స్పోర్ట్స్ స్కూల్, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, మోడల్ జి.పి. స్కూల్స్ వివరాలతో కూడిన శకటాన్ని ప్రదర్శించారు.  డి.ఆర్. డి.ఓ. నుండి ఎం.జి.ఎన్.ఆర్.ఇ. జి.ఎస్ పనులు, హరిత హారం, ఐ.డబ్ల్యు.ఎం.పి., సి.ఎం. గిరి వికాసం, ఉన్నతి ప్రాజెక్ట్, పెన్షన్లు వివరాలతో కూడిన శకటాన్ని ప్రదర్శించగా, జిల్లా విద్యాశాఖాధికారిచే డిజిటల్ ఎడ్యుకేషన్, పాఠ్యపుస్తకాల పంపిణీ, హరిత హారం, పాఠశాలలకు భగీరథ వాటర్ సప్లై గురించి వివరిస్తూ శకటం ప్రదర్శించారు.  జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ శకటం ప్రదర్శించనైనది. శకటాల ప్రదర్శనలో మొదటి బహుమతి డి.ఆర్. డి.ఓ. శకటానికి రాగా, జిల్లా పంచాయితీ అధికారి కార్యాలయానికి చెందిన శకటానికి రెండవ బహుమతికి ఎంపిక కాబడినవి.

జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జెడ్.పి. హెచ్. ఎస్., లక్ష్మీపురం విద్యార్ధులు, జెడ్.పి. హెచ్. ఎస్. ఏదులపూసలపల్లి, క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్, టి.ఎస్ డబ్ల్యు. ఆర్. ఎస్., మహబూబాబాద్ పాఠశాలల విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన టి.ఎస్.ఎస్. కళాకారులు గిద్దె రాం నర్సయ్య, కొమిరె వెంకన్న టీం సభ్యులు దేశభక్తి గీతాన్ని పాడారు. అనంతరం 23 మంది  స్వాతంత్య్ర సమరయోధులకు, వారి కుటుంబాల సభ్యులను మంత్రి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు  శాలువాలతో ఘనంగా సత్కరించారు.

 రైతుకు రుణభారాన్ని తగ్గించేందుకు మొదటి దశలో 25వేల లోపు రుణమాఫీ చేశారని, రెండో విడతలో 50వేల లోపు రూపాయల రుణమాఫీ క్రింద 15 వేల 364 మంది రైతులకు లబ్ది చేకూరేవిధంగా 49 కోట్ల 32 లక్షల చెక్ ను  జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారికి మంత్రి అందజేశారు.
విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇచ్చారు. తదనంతరం ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలపై ఏర్పాటు చేసిన చాయా చిత్రప్రదర్శన, లైవ్ ప్రదర్శన స్టాల్స్ ను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అంగోతు బిందు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్. కోటిరెడ్డి, ఎం.పి. మాలోతు కవిత, శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్, ట్రైనీ కలెక్టర్ అభిషెక్ అగస్త్య, అడిషనల్ కలెక్టర్ డి. కొమురయ్య, మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి, స్వాతంత్య్ర సమర యోధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్ధినీ, విద్యార్ధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.—————————————————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post