ముషంపల్లి గ్రామంలో దుండగుల చేతిలో ధన లక్ష్మీ అనే మహిళ దారుణ హత్య ఘటన: సంఘటన అమానుషం* *ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ** *దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరణ* సంఘటన అమానుషం* *ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ** *దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరణ*

నల్లగొండ జిల్లా నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని ముషంపల్లి గ్రామంలో బుధవారం రోజున గుడిపాటి ధన లక్ష్మి అనే మహిళ దారుణ హత్య ఘటన అమానుషం అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు.గురువారం ఉదయం జిల్లా కేంద్రప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఆయన మృతురాలి భౌతిక ఖాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మృతురాలికుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముషంపల్లి ఘటన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు.దుండగులకు శిక్ష పడేలా ఆధారాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలపై ప్రజల్లో స్పందన రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముషంపల్లి ఘటన పై  గ్రామ ప్రజల స్పందన ఇతరులకు మార్గదర్శనం కావాలని ఆయన విజ్ణప్తి చేశారు.మంత్రి జగదీష్ రెడ్డి వెంట నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఉప్పల శ్రీనివాస్,నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందాడి సైదిరెడ్డి,మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగరి భార్గవ్ డి ఐ జి ఏ వి రంగనాధ్,డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు*

ముషంపల్లి గ్రామంలో దుండగుల చేతిలో ధన లక్ష్మీ అనే మహిళ దారుణ హత్య, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ : మంత్రి జగదీష్ రెడ్డి

Share This Post