ముషంపల్లి గ్రామాన్ని సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి

పత్రికా ప్రకటన

పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,డి ఐ జి ఏ వి రంగనాధ్,అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్ తదితరులు
===============
ముషంపల్లి లో జరిగిన సంఘటన బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శ్రీమతి సునీతా లక్ష్మా రెడ్డి పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె అన్నారు.గురువారం సాయంత్రం ముషంపల్లి కి చేరుకున్న ఆమె బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దుండగులు శిక్ష నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం బలమైన సాక్ష్యాధారాలు సేకరించిందని ఆమె వెల్లడించారు.గ్రామంలో బెల్ట్ షాప్ చర్యలు చేప్పట్టే లా చర్యలు తీసుకుంటామని ఆమె గ్రామస్థులకు భరోసా ఇచ్చారు.అంతకు ముందు ఆమె ఇదే విషయం పై స్థానిక శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తో కలసి డి ఐ జి ఏ వి రంగనాధ్,జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ లతో పరిస్థితిని సమీక్షించారు.అనంతరం నల్గొండ జిల్లా కేంద్రం లో సఖి కేంద్రం ను సందర్శించి బాధిత మహిళలకు అందుతున్న సేవలు తెలుసుకున్నారు.

Share This Post