ముసలమ్మ జాతర కు సకల సదుపాయాలు కల్పించాలి…

ప్రచురణార్థం

ముసలమ్మ జాతర కు సకల సదుపాయాలు కల్పించాలి…

కొత్తగూడ
మహబూబాబాద్, జనవరి 10.

గుంజేడు ముసలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు.

సోమవారం కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ దేవాలయాన్ని జడ్పీ చైర్పర్సన్ ఆం గోతు బిందు జిల్లా కలెక్టర్ శశాంక లతో కలిసి ఫెన్సింగ్ , షెడ్స్ నిర్మాణం , రహదారి పనులు, మరుగుదొడ్లు త్రాగు నీటి సౌకర్యాలు ఆలయానికి రంగులు వంటి అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

మేడారం జాతర పురస్కరించుకొని శాఖ ద్వారా మంజూరు చేసిన ఒక కోటి ఇరవై లక్షల నిధులలో గుంజేడు ముసలమ్మ జాతర కు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నందున 24 లక్షలతో భక్తులకు కావలసిన వసతి సౌకర్యాలను కల్పించాలని ప్రజాప్రతినిధులను అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని త్వరితగతిన పూర్తి చేస్తూ భక్తులకు అందుబాటులోకి తేవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యనిర్వహణ అధికారి హేమలత డిఈ మధుకర్ ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు
————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post