*ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

For Scrolling

Media Release

Dt:02-05-2022

 

*ముస్లింల పవిత్ర పండుగ రంజాన్(ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు*

*ఈద్ ఉల్ ఫితర్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.*

రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు అందరూ పొందాలని కోరుకున్నారు.

రంజాన్ మాసంలో ఆచరించే ఉపవాసం, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది అన్నారు.

గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ ప్రతీక అని, లౌకిక వాదం, మత సామరస్య పరిరక్షణ లో సీఎం కెసిఆర్ గారి ఆలోచనలతో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

షాదీ ముబారక్ ద్వారా పేద ఆడ బిడ్డల పెండ్లికి ఆర్థిక సహాయం, మైనారిటీ విద్యార్థులకు గురుకులాల ద్వారా విద్య, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ద్వారా ముస్లిం విద్యార్థుల విదేశీ విద్య లాంటి పథకాలతో ముస్లిం అభ్యున్నతికి సీఎం కెసిఆర్ గారి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు.

మరోసారి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Share This Post