ముస్లిం సోదరులకు జిల్లా కలెక్టర్  రంజాన్ శుభాకాంక్షలు

ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగ పురస్కరించుకుని నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకు ముస్లిం సోదరులకు జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ…. ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్‌ ఉపవాసాన్ని వేసవి కాలం అయినప్పటికీ ఎండ వేడిమిని తట్టుకొని నిష్టతో కఠినంగా ఉపవాస దీక్షలను పాటించారని అన్నారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ముగించి ఈద్ ఉల్  ఫితర్  జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు.
నెల రోజుల పాటు  ఉపవాస దీక్షలో ఉన్న మంగళవారం భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటున్నారని అన్నారు.
క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక రంజాన్  పండుగ అన్నారు.
పవిత్రతకు, త్యాగానికి, మత సామరస్యం, సోదర భావం చాటి చెప్పే పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో  జరుపుకోవాలని, అల్లా దయతో జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆనంద వెల్లివిరాయలని కలెక్టర్ ఆకాక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ నుండి నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 6500 ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేయడం జరిగిందని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 13 లక్షల రూపాయలతో ఇఫ్తార్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.

Share This Post