ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు…..

ప్రచురణార్ధం

ముస్లీం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు…..

మహబూబాబాద్, జూలై 20 :
త్యాగనిరతికి ప్రతీకైన బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి  సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజనసంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్ పర్సన్ కుమారి అంగొత్ బిందు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు.  

ముస్లీం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగలో కరోనా  నిబంధనలను తప్పక పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, తోటి మానవుల పట్ల ప్రతి ఒక్కరూ త్యాగ నిరతి, కరుణ, సహనం, సానుభూతితో వ్యవహరించేలా ఈ పండుగ గుర్తు చేస్తుందని అన్నారు.

———————————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post