మూడు మద్యం దుకాణాలు లక్కీడ్రా ద్వారా కేటాయింపు

 

కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో పెండింగ్ లో ఉంచిన మూడు మద్యం దుకాణాలకు మంగళవారం నాడు ద్వారా విజేతలను చేశారు.
ఈనెల 20న లక్కీ డ్రా ద్వారా జిల్లాలో 102 మద్యం దుకాణాలను ఎంపిక చేయాల్సి ఉండగా 99 ని ఎంపిక చేసి దరఖాస్తులు సంతృప్తికరంగా రాని 8, 36, 99 నంబరు గల షాపులను పెండింగ్లో ఉంచిన సంగతి తెలిసిందే.

వాటికి తిరిగి దరఖాస్తులు స్వీకరించి మంగళవారం నాడు కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post