మూడు రోజులలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్.
వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడ కూడా త్రాగు నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట రూరల్ ఏండ్ల పల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఓహెాచ్‌ఎస్‌ఆర్ ట్యాంక్, ఇంట్ర పైప్ లైన్ పరిశీలించి మూడు రోజులలో సమస్య పరిష్కరించాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏవిన్యూ ప్లాంట్ కింద పెరుగుతున్న మొక్కలను పరిశీలించి మొక్కలను కాల్చిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ వెంకటేశ్వర్లు, ఇంట్రా ఈఈ వెంకటేశ్వర రావు, తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఏఈ భారత్ తదితరులు ఉన్నారు.