మూడు వేప చెట్లకింద పేద విద్యార్థులకు వేసవి శిబిరం ద్వారా అద్భుతమైన కళలు నేర్పించి మనుసుంటే మార్గముంటది అనే నానుడి నిజం చేశారు- జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

మూడు వేప చెట్లకింద పేద విద్యార్థులకు వేసవి శిబిరం ద్వారా అద్భుతమైన కళలు నేర్పించి మనుసుంటే మార్గముంటది అనే నానుడి నిజం చేశారని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఉపాధ్యాయులను ప్రశంసించారు. మంగళవారం ఉదయం స్థానిక శ్రీ అక్షర కాన్సెప్ట్ స్కూల్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్తులకు వారికి ఇష్టమైన కళలను నేర్పించాలనే సంకల్పంపంతొ జిల్లాలో ఎలాంటి వసతులు, సౌకర్యాలు లేకున్నా వేసవి శిక్షణ శిబిరం నిర్వహించాలని జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారిని, జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించడం జరిగిందన్నారు. కొంత మంది ఉపాధ్యాయులు తాము నేర్చుకున్న కళలను విద్యార్థులకు నేర్పించాలని స్వచ్చందంగా ముందుకు వచ్చి అని సౌకర్యాలు సమకూర్చుకుంటు పిల్లలకు చిత్రలేఖనం, సంగీతం, కూచిపూడి, క్రాఫ్ట్, చేతివ్రాత, కోలాటం, మ్యూజిక్ కీబోర్డు వంటి కళలను నేర్పించగా విద్యార్థులు సైతం సద్వినియోగం చేసుకొని తక్కువ సమయంలో చాలా బాగా నేర్చుకొని చేసి చూపించడం పై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఉన్న ఆసక్తి, నైపుణ్యం, నేర్చుకోవాలనే తపన చూసిన కలెక్టర్ ఇది కేవలం నమూనా మాత్రమేనని, త్వరలో జిల్లాలో బాలభవన్ ఏర్పాటు చేసి మరింత సౌలభ్యం చేకూర్చుతామని హామీ ఇచ్చారు. పిల్లలు నేర్చుకున్న కూచిపూడి, కోలాటం, చేతివ్రాత, చిత్రలేఖనం, చెస్, క్యారమ్, సంగీతం కీబోర్డు ప్రదర్శనలు చేయగా అక్కడ విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్ చూసి ఆనందం వ్యక్తం చేశారు. చేతివ్రాత జీవితంలో చాలా ముఖ్యమైనదని అందంగా రాస్తే మార్కులు ఎక్కువ రావడమే కాకుండా వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందన్నారు. ఇప్పుడు నేర్చుకున్న విద్య ప్రగతికి మెట్లుగా ఉపయోగపడతాయని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి శిక్షణ నిర్వహించి పేద విద్యార్థులకు మంచి కళలు నేర్పించినందుకు జిల్లా కలెక్టరుకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం స్వచ్చందంగా వచ్చి విద్యను నేర్పించి ఉపాధ్యాయులకు కలెక్టర్ సన్మానం చేశారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమానాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ గోవింద రాజులు, బి.సి. సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, అసిస్టెంట్ బి.సి. సంక్షేమ అధికారి శ్రీధర్ జీ, సైన్స్ అధికారి కృష్ణ రెడ్డి, స్ట్రాంగ్ టీచర్ వేంకటేశ్వర శెట్టి, పద్మాలయ, ఇద్రిస్, మురళీధర్ రావు, గోపాల్, మధుసూదన్, ఎస్.జి.ఎఫ్. ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post