మెగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

శుక్రవారం నాడు కలక్టర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం ములకనూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం ములకనూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సబ్ సెంటర్ ను ప్రారంభించారు.అనంతరం కొత్తకొండ, మల్లారం, గట్లనర్సింగాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సబ్ సెంటర్లలో కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పల్లెలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగించాలని అన్నారు., జిల్లాలో ఇందుకోసం 87 సబ్ సెంటర్లు ను ఏర్పాటు చేయడం జరిగిందని, 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రెండు డోసులు తప్పనినరిగా తీసుకోవాలని సూచించారు.జిల్లాలో ఇప్పటివరకు కరొనా వాక్సినేషన్ ను 73 శాతంగా నమోదు అయ్యిందని‌,ఇందుకు 1300 మంది వైద్య సిబ్బంది వినియేగించినట్లు తెలిపారు..ప్రతి ఒక్కరికి వాక్సినేషన్ ను ఇవ్వాలని,ఆ వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌పై వైద్య శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయం పని చేసి విజయవంతం చేయాలని ఆయన అన్నారు.సెంటర్ లలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వడం చూడాలని, తాగునీరు సౌకర్యం కల్పించాలని ఆయన సూచించారు.వాక్సినేషన్ పై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని అన్నారు. ఇంటింటికి తిరిగి సర్వే చేసి, వ్యాక్సిన్ తీసుకున్నది లేనిది వివరాలు సేకరించి, స్టిక్కర్లు అంటించాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు మాస్కులను ధరించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు . వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చిన ప్రాణభయం ఉండదని, వ్యాక్సిన్ తో కరోనాను తట్టుకునే శక్తి వస్తుందని, ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావు ఇవ్వరాదని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డా. లలిత దేవి, జెడ్పిటిసి వంగ రవి, ఎం పిపి అనిత, ఎపిడిఓ సునీత, హెచ్ఈ ఓ రాజేశ్వరరెడ్డి, ఎంపిటిసి, సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు, వార్డు మెంబర్లు స్టాప్ నర్సులు, ఏ ఎన్ఎంలు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Share This Post