మెడికల్ కళాశాల అనుబంధ ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో రక్తం అందక మాతృ మరణాలా – జిల్లా కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్

మెడికల్ కళాశాల అనుబంధ ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో రక్తం అందక మాతృ మరణాలా – జిల్లా  కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్

 

వైద్యులు ఏం చేస్తున్నారు?

 

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

 

వైద్యఆరోగ్యశాఖ సమీక్షలో కలెక్టర్‌

 

‘జిల్లాలో 6 మాతృమరణాలా?.

 

.ఇంత మంది మరణిస్తుంటే ఏం చేస్తున్నారు.?

 

దీనికి గల కారణాలను ముందే ఎందుకు గుర్తించలేకపోయారు?

సమీక్షకు హాజరు కాని వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలి

 

ఇది చాలా బాధాకరం’ అని వైద్యాధికారులపై కలెక్టర్‌ పి.ఉదయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై వైద్య ఆరోగ్యశాఖపై కలెక్టర్‌ సమీక్షించారు. గత ఏడాది కాలంలో ఏప్రిల్ మాసం నుండి  జిల్లాలో 2, పట్టణ ప్రాంతాల్లో 4, గ్రామీణ ప్రాంతాల్లో  6 మాతృ మరణాలు సంభవించినట్లు నివేదికల ద్వారా కలెక్టర్‌ తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృ మరణాలు జరగకుండా వైద్యులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మాతృ మరణాలు సంభవించకుండా బిపి ఎక్కువ ఉన్న గర్భిణీలను జిల్లా జర్నల్ ప్రభుత్వ ఆస్పత్రిలో 15 రోజుల ముందస్తుగా ఆసుపత్రిలో చేర్చించి  చికిత్స చికిత్సలు అందించి మాతృ మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.

జిల్లా ఆసుపత్రిలో రక్తం స్రావంతో బాధపడి గర్భిణీని మహబూబ్నగర్ ఆసుపత్రికి రిఫర్ చేయడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటువంటి ఘటనలపై బహుళ దశల్లో వైఫల్యంగా భావించాల్సి ఉంటుందన్నారు.

మాతృ మరణాలు సంభవించిన ఘటనల్లో 22 ఏళ్ల ఆరోగ్య గర్భిణీలు ఉండడం బాధాకరమన్నారు.

సకాలంలో తీవ్రతను గుర్తించకపోవడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు.  ప్రసవం తర్వాత అవసరమయ్యే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితిని ఏఎన్‌ఎంలు నిశితంగా గమనించాలని   సూచించారు.

హైరిస్క్‌ కేసులను గుర్తించి సాధ్యమైనంత మేరకు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని తెలిపారు.

ప్రాథమిక పరీక్షలైన బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ వంటివి  విధిగా నిర్వహించాలన్నారు. ఎంఎంఆర్‌ ఎక్కువగా ఉండటం బాధాకరమన్నారు. నివారించదగిన మరణాలపై స్పష్టమైన నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

తోటపల్లి తిమ్మాజిపేట వెల్దండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మృతి చెందిన ఘటనల కు సంబంధించిన వైద్యులు హాజరు కాకపోవడం కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాటి సమీక్షలను తదుపరి తేదీల్లో వైద్యులను ఆదేశించారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో మాతృ మరణాలు సంభవిస్తే చికిత్స అందించిన వైద్యులు కూడా హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మృతి చెందిన గర్భిణీల కుటుంబ సభ్యులతో ఘటన పూర్వాపరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

రఘుపతి పేట, వెల్దండ, తిమ్మాజిపేట, పెద్దూరు, పెద్ద ముద్దునూరు, పెద్దకొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గ్రామాల గర్భిణీల మృతులపై ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు వైద్యులతో సమీక్షించారు.

రఘుపతి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో సంభవించిన మాతృ మరణంపై తదుపరి తేదీల్లో సమగ్రంగా విచారించనున్నట్లు వెల్లడించారు

ఈ సమావేశంలో ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ భరత్ రెడ్డి, కల్వకుర్తి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శివరాం, జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్ట్ నిర్మల దేవి, ఆర్ ఎం ఓ డాక్టర్ అజీమ్, డాక్టర్ రోహిత్, కొల్లాపూర్ ఆస్పత్రి వైద్యులు విజయ్ కుమార్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post