మెడికల్ కళాశాల ఆకస్మిక తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన      తేది:30.05.2022, వనపర్తి.

వనపర్తి జిల్లా విద్య, వైద్యం రంగాలలో అభివృద్ధి చెందుతుందని అధికారులు మెడికల్, నర్సింగ్ కళాశాలల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
సోమవారం మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాల పనులు సత్వరం పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం వనపర్తి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నదని, కళాశాల నిర్మాణం పనులు సత్వరమే పూర్తి చేయడానికి అధికారులు దృష్టి సారించాలని ఆమె అన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల గదులను ఆమె పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు, మెడికల్ కళాశాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post