మెడికల్ కళాశాల నిర్మాణ భవనాన్ని పరిశీలించిన – జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్

జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి మూడు రోజుల్లో భవనాన్ని అందజేయాలని, జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉయ్యాలవాడ సమీపంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను అధికారులు, గుత్తేదారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
రానున్న వారం రోజుల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యుల బృందం పర్యటన సందర్భంగా ముందస్తుగా నాగర్ కర్నూలు నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజ్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవనాన్ని పరిశీలించిన కలెక్టర్ , వీలైనంత త్వరగా చివరిదశ పెండింగ్ పనులను పూర్తి చేసి భవనాన్ని, ఈనెల ఆరో తేదీ లోగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.
వైద్య కళాశాల పనుల పురోగతిపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

Share This Post