ప్రచురణార్థం
మెడికల్ కళాశాల పనులను వేగవంతం చేయాలి
మహబూబాబాద్ నవంబర్ 24.
మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వేగవంతం గా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
బుధవారం కలెక్టర్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి తో కలిసి మెడికల్ కళాశాల నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు.
ప్రభుత్వం నిర్దేశించిన విధంగా మెడికల్ కళాశాల పనులు చేపడుతూ, అధికారులు పర్యవేక్షిస్తూ పనుల వేగవంతానికి కృషి చేయాలన్నారు.
కోట్ల రూపాయలతో నిర్దేశించిన పనులు నిర్ణీత సమయంలోనే జరగాలన్నారు.
అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు భూక్య వెంకట రాములు తో కలిసి ప్రభుత్వాసుపత్రిలో చేపడుతున్న అదనపు బెడ్స్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు పనులు వేగవంతంగా చేపట్టాలని
పనులు నాణ్యతతో ఉండే విధంగా పర్యవేక్షించాలన్నారు.
అనంతరం హాస్పిటల్ లో మార్చురీ గది సామర్ధ్యం పెంచేందుకు నిధుల మంజూరుకై జాతీయ ఆరోగ్య మిషన్ కు ప్రతిపాదనలు పంపాలన్నారు.
హాస్పిటల్ నిర్వహణ తీరుపై సమీక్షిస్తూ వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. హాస్పటల్ ను నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్య సేవలను మెరుగుపరచాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు భూక్య వెంకట రాములు టి ఎస్ ఎమ్ ఐ డి సి ఈ ఈ ఉమా మహేష్ డి ఈ శ్రీనివాస్ ఆర్ ఎం ఓ వైదేహి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది