ప్రచురణార్థం
మెడికల్ కళాశాల పనులను వేగవంతంగా చేపట్టాలి…
మహబూబాబాద్ నవంబర్ 15.
మెడికల్ కళాశాల పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
సోమవారం పట్టణంలోని తొర్రూర్ రోడ్ లో 30 ఎకరాల లో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.
మెడికల్ కళాశాల స్థలంలో అనుబంధంగా నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల జి ప్లస్ టూ పనులను కలెక్టర్ పరిశీలిస్తూ పనులను నాణ్యతతో చేపట్టే విధంగా ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలన్నారు.
40 కోట్లతో సుమారు లక్ష చదరపు అడుగుల పరిధిలో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్ నిర్మాణం, ఫెన్సింగ్ ఏర్పాటు వంటివి పూర్తి అయ్యాయని, విద్యుత్ లైన్ వేస్తున్నట్లు తెలియజేశారు.
ప్రస్తుతం ఓకే షిఫ్టు జరుగుతుండటంతో డే అండ్ నైట్ పనులు చేపట్టాలని మూడు షిఫ్టులు వారీగా పనులు ఉండాలన్నారు.
షెల్టర్లు నిర్మించాలని, వాటికి మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.
అపరిచితులను లోనికి రానీయ రాదని అన్నారు. పోలీస్ అప్రమత్తంగా ఉండాలన్నారు. నిఘా పెంచాలన్నారు.
కలెక్టర్ వెంట ఆర్ అండ్ బి ఈ ఈ తానేశ్వర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా పర్యవేక్షకులు భూక్య వెంకట రాములు సర్వేయర్ విజయ భాస్కర్ రెవెన్యూ సిబ్బంది నరేష్ వినయ్ తదితరులు ఉన్నారు.
————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది