మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాజర్షి షా

మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాజర్షి షా

మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు సూచించారు.

మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. 89000 స్క్వేర్ ఫీట్ ప్లింత్ ఏరియా లో 1,18,000 స్క్వేర్ ఫీట్( గ్రౌండ్ ఫ్లోర్+ ఫస్ట్ ఫ్లోర్+ హెడ్ రూమ్) లతో ప్రి కాస్ట్ కాంక్రీట్ స్ట్రక్చరల్ సిస్టమ్ విధానంలో రూ. 30 కోట్ల నిధులతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఎర్త్ వర్క్, పిసిసి పనులు, ఫుటింగ్ పనులు పూర్తి కాగా కాలమ్, బీమ్, స్లాబ్ మరియు గోడల పనులు ప్రి కాస్ట్ విధానం లో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. గ్రౌండ్ లెవెల్ స్లాబ్ మరియు మొదటి ఫ్లోర్ బీమ్ పనులు వేగంగా జరుగుతున్నాయని , ఇప్పటి వరకు రూ. 4.50 కోట్ల పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అగ్రిమెంట్ గడువు తేదీ 10 ఏప్రిల్ అయినప్పటికి ఫిబ్రవరి 10 వ తారీఖు వరకు పూర్తి చేయుటకు లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నాణ్యత గా, వేగవంతంగా పూర్తి చేయుటకు జిల్లా రోడ్లు భవనము ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

అదనపు కలెక్టర్ వెంట రోడ్డు భవనాల అధికారులు, తదితరులు ఉన్నారు

Share This Post