మెడికల్ కళాశాల రహదారి పనులను వేగవంతం చేయాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్ నవంబర్ 30.

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని తొర్రూరు వెళ్లే ప్రధాన రహదారి నుండి మెడికల్ కళాశాల వరకు నిర్మిస్తున్న రహదారి పనులను అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు.

మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్దేశించిన విధంగా నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని ఆదేశించినా వేగవంతం చేయలేక పోతున్నారని ఇది సరికాదన్నారు. రెండు రోజుల్లో రహదారి పనులు మెరుగైనట్లు కన్పించాలన్నారు.

రహదారిని మ్యాప్ ద్వారా పరిశీలిస్తూ…సలహాలు సూచనలు ఇచ్చారు.
రోజువారీ ప్రగతి కన్పించాలన్నారు.

పనులలో నాణ్యత లేకపోతే చర్యలు తీసుకుంటామని తెలియజేసారు.

ప్లాంటింగ్ విధానాన్ని ఉద్యాన శాఖ అధికారికి తెలిపారు. నీడనిచ్చే చెట్లను ఒక వైపు, మరో వైపు అందమైన పూల మొక్కలు నాటింప చేయాలన్నారు.

కలెక్టర్ వెంట ఆర్.అండ్ బి.ఈఈ తానేశ్వర్, ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, తహసీల్దార్ నాగ భవాని తదితరులు పాల్గొన్నారు.

Share This Post