పత్రికా ప్రకటన
మెడికల్ కళాశాల విద్యార్తినిలకు వసతి గృహం కోసం భవనం పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్
మెడికల్ కళాశాల విద్యార్తినిలకు హాస్టల్ వసతి కోసం నల్గొండ పట్టణం లో రవీంద్ర నగర్ లోసెయింట్ అంథోనీ. స్కూల్ ఎదురుగా ఉన్న భవనాన్ని అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురు వారం పరిశీలించారు.భవనం అనువుగా ఉన్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి భవనం లో విద్యార్తినిలలకు వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.జితేందర్ ను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టర్ తో ఆర్.డి.ఓ.జగదీశ్వర్ రెడ్డి, ఆర్&బి ఈ. ఈ నరేందర్, తహశీల్దాట్ నాగార్జున తదితరులు ఉన్నారు.