మెడికల్ కాలేజ్ ఏర్పాటు కు స్థలం పరిశీలించిన జిల్లా కలెక్టర్

ప్రచురణార్థం—-1
మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి సెప్టెంబర్ 5
:- రామగుండంలో మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని రేపటి వరకు ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం నాడు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్ నుండి సీఎం ఓ.ఎస్.డి డాక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి వచ్చిన అధికారుల బృందానికి జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. గోదావరిఖని లోని ఏరియా ఆసుపత్రిని మరియు సింగరేణి ఆసుపత్రిని వారు పరిశీలించారు. అనంతరం రామగుండంలో ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి సింగరేణి ఫవర్ హౌస్ వారి 15 ఎకరాల స్థలాన్ని బృందం పరిశీలించింది. అనంతరం ఇల్లందు అతిథి గృహంలో మెడికల్ కాలేజ్ భవన నిర్మాణానికి అనువైన స్థలం ఎంపికపై సమీక్ష నిర్వహించారు. సింగరేణి మరియు రెవెన్యూ అధికారులతో సంయుక్తంగా సర్వే నిర్వహించి మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని రేపటి వరకు ఎంపిక చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని కలెక్టర్ తెలిపారు

డిఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి, టిఎస్ఎం ఎస్ ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి,టిఎస్ఎంఎస్ ఐడిసి చీఫ్ ఇంజనీర్ రాజేంద్రకుమార్, వైద్యులు డాక్టర్ రాంబాబు నాయక్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, గోదావరిఖని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లి చేజారి చేయబడినది.

Share This Post